Tesla CEO : టెస్లా మాకంటే..మాకంటున్న రాష్ట్రాలు..మరి ఎక్కడకు వస్తుంది ?

రాష్ట్రాలు ఇస్తామంటున్న ప్రోత్సాహ‌కాలు న‌చ్చి మ‌స్క్ ఇండియాకు వ‌స్తారా? అలా వస్తే కేంద్రం సానుకూలంగానే ఉంటుందా? అసలు కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాల్లో...

Elon Musk

Non BjP States Welcome To Tesla : టెస్లా.. మాకంటే మాకంటున్నాయి రాష్ట్రాలు. మీరు ఊ అనండి చాలు.. మిగతాదంతా మేం చూసుకుంటామని భరోసా ఇచ్చేస్తున్నాయి.. ఇదంతా అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లాను దక్కించుకునేందుకు రాష్ట్రాల మధ్య పోటీ నెలకొంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ను కోరుతున్నాయి. ఎలన్‌ మస్క్‌ చేసిన ఓ ట్వీట్ తో రాష్ట్రాలు ఇలా స్పందిస్తున్నాయి. ఇటీవ‌లే ఒక నెటిజెన్ భార‌త్‌లో మీ కార్ల ప్రవేశం ఎప్పుడంటూ అడిగిన ప్రశ్నకు బదులుగా..భార‌త ప్రభుత్వ నిర్ణయాలే తమకు అడ్డంకిగా ఉన్నాయ‌ంటూ ఆన్సర్‌ ఇచ్చారు. భారత్‌లో తమ కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వ నిబంధనలే అడ్డంకి అంటూ ఎలన్‌ మస్క్‌ ట్వీట్‌ చేయడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Read More : International Beggar: ఇమ్రాన్ ఖాన్ ఒక “అంతర్జాతీయ బిచ్చగాడు”

విచిత్రమేమిటంటే టెస్టా కోసం పోటీకి దిగిన రాష్ట్రాల‌న్ని కూడా బీజేపీయేత‌ర పాలిత రాష్ట్రాలు కావడం మరో విశేషం. భారత్‌లో 2021 తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని గతంలోనే టెస్లా ప్రకటించింది. ఈవీ కార్ల తయారీ ప్లాంట్‌ను భారత్‌లో పెడతామని తెలిపింది. అయితే ఆచరణలో అది జరగలేదు. ఆలస్యం.. అమృతం అన్నట్టుగా టెస్లా ప్లాంట్‌ను దక్కించుకునేందుకు రాష్ట్రాల మధ్య పోటీ నెలకొంది.. ఇప్పటికే పలు రాష్ట్రాలు టెస్లాతో చర్చలు జరుపుతున్నాయి.. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ ట్వీట్టర్‌ వేదికగా ఎలన్‌కు ఎప్పుడో తమ రాష్ట్రానికి వచ్చేయండని వెల్‌కమ్‌ చెప్పారు.. పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమని.. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయంటూ మస్క్‌కు కూడా వెల్‌కమ్‌ చెప్పారు.

Read More : Exams Postponed : కోవిడ్ ఎఫెక్ట్…పరీలుక్షలు వాయిదా వేస్తున్న యూనివర్సిటీలు

తెలంగాణ‌కు పోటీగా మహారాష్ట్ర సైతం రంగంలోకి దిగింది.. టెస్లా త‌మ రాష్ట్రానికి వస్తానంటే రెడ్‌ కార్పెట్ పరిచి మరీ వెల్‌కమ్‌ చెబుతామంటోంది. మ‌హారాష్ట్ర దేశంలోనే వేగంగా పురోగ‌మిస్తున్న రాష్ట్రం… తమ రాష్ట్రంలో మీ త‌యారీ కేంద్రం ఏర్పాటు చేయ‌డానికి ఆహ్వానిస్తున్నామంటూ మహారాష్ట్ర మంత్రి జయంత్‌ పాటిల్‌ మస్క్‌కు ట్వీట్‌ చేశారు.
ఈ రేస్‌లో పశ్చిమబెంగాల్‌ సైతం జాయిన్‌ అయ్యింది.. అసలు బెంగాల్‌ అంటేనే బిజినెస్‌ అన్నారు ఆ రాష్ట్ర మంత్రి మ‌హ్మద్ గులాం ర‌బ్బానీ. ఉత్తమ మౌలిక వ‌స‌తుల‌కు ప‌శ్చిమ‌బెంగాల్ పెట్టింది పేరని… బెంగాల్ అంటేనే బిజినెస్ అంటూ ట్వీట్ చేశారు. ప‌శ్చిమ బెంగాల్‌లో టెస్లా యూనిట్ ఏర్పాటు చేసేందుకు రావాల‌ని ఆహ్వానించారు.

Read More : AP Covid : సంక్రాంతి సందడి ముగిసింది..రేపటి నుంచే నైట్ కర్ఫ్యూ

ఇక పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌ సింగ్ సిద్దూ కూడా ఇదే క్లబ్‌లో జాయిన్‌ అయ్యారు.. త‌మ రాష్ట్రంలో త‌యారీ యూనిట్ ఏర్పాటు చేయాల‌ని ఎల‌న్‌మ‌స్క్‌ను ఆహ్వానించారు. లుధియానాలో ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ అండ్ బ్యాట‌రీ ఇండ‌స్ట్రీ హ‌బ్ క్రియేట్ చేస్తామని… పంజాబ్‌కు నూత‌న టెక్నాల‌జీతో పెట్టుబ‌డులు పెట్టడానికి వ‌చ్చే వారికి నిర్దిష్ట గ‌డువుతో కూడిన సింగిల్ విండో క్లియ‌రెన్స్ ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారు. అయితే టెస్లా కంపెనీ రిజిస్ట్రేషన్‌ మాత్రం కర్ణాటకలో జరగడం ఒక విశేషం. 2017లోనే కంపెనీ కర్ణాటక నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకుంది. కానీ ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.దీంతో ఈ అంశం కూడా రాజకీయ రంగు పులుముకుందనే చెప్పాలి.. ఒక్క ట్వీట్‌తో మస్క్‌ రాజకీయాల్లో వేడి పుట్టించారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రాలు ఇస్తామంటున్న ప్రోత్సాహ‌కాలు న‌చ్చి మ‌స్క్ ఇండియాకు వ‌స్తారా? అలా వస్తే కేంద్రం సానుకూలంగానే ఉంటుందా? అసలు కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాల్లో మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్లు నెలకొల్పుకోవచ్చా? అన్న దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.