International Beggar: ఇమ్రాన్ ఖాన్ ఒక “అంతర్జాతీయ బిచ్చగాడు”

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి తప్పిస్తే తప్ప పాకిస్తాన్ కు మంచి రోజులు రావని ఆదేశ జాతీయ పార్టీ జమాత్-ఈ-ఇస్లామీ నేత సిరాజ్ ఉల్-హక్ వ్యాఖ్యానించారు.

International Beggar: ఇమ్రాన్ ఖాన్ ఒక “అంతర్జాతీయ బిచ్చగాడు”

Paki

International Beggar: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి తప్పిస్తే తప్ప పాకిస్తాన్ కు మంచి రోజులు రావని ఆదేశ జాతీయ పార్టీ జమాత్-ఈ-ఇస్లామీ నేత సిరాజ్ ఉల్-హక్ వ్యాఖ్యానించారు. ఆదివారం పాకిస్తాన్ లోని లాహోర్ లో జరిగిన ఎన్నికల సభలో సిరాజ్ ప్రసంగిస్తూ.. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని దుయ్యబట్టారు. దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయని..ప్రస్తుత తరుణంలో ఇమ్రాన్ ఖాన్-పాకిస్తాన్ కలిసి పనిచేయలేవని సిరాజ్ వ్యాఖ్యానించారు.

Also read: Flying Deer: అమాంతం గాల్లోకి ఎగిరిన జింక అబ్బురపరిచే దృశ్యం

ఇదిలాఉంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి.. ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF) రూపంలో $6 బిలియన్ అమెరికన్ డాలర్లను ఆశించిన పాకిస్తాన్ కు భంగపాటు కలిగింది. 6 బిలియన్ల నిధులను రాబట్టేందుకు అవసరమైన ఆర్ధిక అనుబంధ బిల్లును ఆదేశ ప్రతిపక్ష సభ్యులు తిరస్కరించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నిర్దేశించిన షరతులకు అనుగుణంగా సప్లిమెంటరీ ఫైనాన్స్ బిల్లు 2021 మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ బిల్లు(సవరణ) 2021 ఆమోదాన్ని ప్రతిపక్షం తిరస్కరించింది.

Also read: Temple Thieves: పళని దేవాలయానికి చెందిన 400 ఏళ్ల నాటి బంగారు, రాగి సూక్ష్మ ఈటెలు మాయం

దీంతో IMFతో ఈ బిల్లు ఆమోదం కోసం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన జమాత్-ఈ-ఇస్లామీ నేత సిరాజ్..”ప్రధాని ఇమ్రాన్ ఖాన్..’అంతర్జాతీయ బిచ్చగాడుగా’ అవతరించారని” వ్యాఖ్యానించారు. ఇకపై దేశంలో కూడికలు తీసివేతలు ఏమీ లేవన్న సిరాజ్.. ఇమ్రాన్ ఖాన్ ను పదవీచిత్యుడిని చేయడం తప్ప మరోదారి లేదని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

Also read: Teachers Issues: 317 జీఓ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల నిరసనలు, అరెస్ట్