AP Covid : సంక్రాంతి సందడి ముగిసింది..రేపటి నుంచే నైట్ కర్ఫ్యూ

రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్ సేవలు..

AP Covid : సంక్రాంతి సందడి ముగిసింది..రేపటి నుంచే నైట్ కర్ఫ్యూ

Ap Night Curfew

Night Curfew In AP : ఏపీలో సంక్రాంతి సందడి ముగిసింది. మూడు నాలుగు రోజుల కోలాహలానికి చెక్ పడింది. కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రాబోతున్నాయి. 2022, జనవరి 18వ తేదీ మంగళవారం రాత్రి నుంచి నెలాఖరు వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయబోతోంది ప్రభుత్వం. ఈ నెల 31 వరకు రాత్రి పూట కర్ఫ్యూను అమలు చేయనున్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఫార్మసీ దుకాణాలు, మీడియా సంస్థలు, టెలి కమ్యూనికేషన్లు, ఐటీ, విద్యుత్ సేవలు, పెట్రోల్ బంకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, సిబ్బంది, విమానాశ్రయాలకు వెళ్లే ప్రయాణికులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు.

Read More : London Man : లైన్‌‌లో నిలబడి వేలు సంపాదిస్తున్నాడు

దీంతో పాటు కరోనా ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కరోనా కట్టడికి అదనంగా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో చర్చిస్తారు… మరోవైపు స్కూల్స్ తెరిచే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. తెలంగాణలో స్కూల్స్‌ సెలవులు పొడిగించినా… ఏపీ ప్రభుత్వం మాత్రం యదావిధిగానే స్కూల్స్‌ను నడుపుతోంది.

Read More : Rains In Andhra,Telangana : తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆఫ్‌లైన్ క్లాస్‌లను కొనసాగిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఉపాధ్యాయులందరికీ వ్యాక్సిన్ వేయించామని… ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తోంది..వచ్చే వారం విద్యార్థులకు 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్. మరి స్కూల్స్ తెరవడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.