Omicron Effect : రైల్వే స్టేషన్‌ని తలపిస్తున్న ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్

ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం వేలాది మంది ఎదురుచూపులతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కిక్కిరిసిపోతుంది. ప్రయాణికులతో విదేశాలకు వెళ్లే ప్రయాణికుల ప్రాంగణం నిండిపోయింది.

Omicron Effect : ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం వేలాది మంది ఎదురుచూపులతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కిక్కిరిసిపోతుంది. ప్రయాణికులతో విదేశాలకు వెళ్లే ప్రయాణికుల ప్రాంగణం నిండిపోయింది. ర్యాపిడ్ టెస్టుకు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుండగా.. సాధారణ ఆర్టీపీసీఆర్ టెస్టుకు ఎనిమిది గంటల సమయం పడుతుంది. దీంతో ప్రయాణికులతో ఇమిగ్రేషన్ డెస్క్ రద్దీగా మారింది.

చదవండి : Farmers In Delhi : తగ్గేదే లే.. కేసులు ఉపసంహరించుకునే వరకు ఉద్యమిస్తామన్న రైతులు

సాధారణంగా ఇలాంటి రద్దీ దృశ్యాలు ఎయిర్ పోర్టులో కనిపించవు, బస్టాండ్, రైల్వేస్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ ఈ స్థాయిలో ఉంటుంది. కానీ ఒమిక్రాన్ భయంతో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు, మన దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేయడంతో ప్రయాణికులతో ఎయిర్ పోర్ట్ నిండిపోయింది. ఇమిగ్రేషన్ డెస్కులు రద్దీగా మారిపోయాయి. కరోనా పరీక్షల కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి సమయం తగ్గించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.

చదవండి :  Omicron Tension In Delhi : ఢిల్లీలోనూ ఒమిక్రాన్ టెన్షన్…12 అనుమానిత కేసులు గుర్తింపు

ఒమిక్రాన్ కేసులు బయటపడ్డ 46 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టిపెట్టారు అధికారులు. కరోనా నిర్దారణ అయితే క్వారంటైన్‌కు పంపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు