Omicron Tension In Delhi : ఢిల్లీలోనూ ఒమిక్రాన్ టెన్షన్…12 అనుమానిత కేసులు గుర్తింపు

దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. ఏకంగా 12 ఒమిక్రాన్ అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. అధికారులు వారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు.

Omicron Tension In Delhi : ఢిల్లీలోనూ ఒమిక్రాన్ టెన్షన్…12 అనుమానిత కేసులు గుర్తింపు

Omicron

12 Omicron suspected cases identified : దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఒమిక్రాన్ టెన్షన్ పట్టుకుంది. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 12 ఒమిక్రాన్ అనుమానిత కేసులను అధికారులు గుర్తించారు. అధికారులు వారిని లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు. వివిధ దేశాల నుంచి వచ్చిన 12 మందికి పరీక్షలు చేయగా అందులో 10 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో ఇద్దరిలో కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరందరికీ ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లుగా అనుమానిస్తున్నారు. వీరి శాంపిల్స్ ను అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించారు.

భారత్ లోకి ఎంటర్ అయిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు సంబంధించి ఢిల్లీలో కూడా కల కలం రేపుతోంది.  ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన 12 మందిలో ఢిల్లీకి వచ్చిన 10 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో ఇద్దరికి టెస్టులు జరగాల్సివుంది. ఈ 10 మంది శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు అధికారులు పంపారు. కరోనా బాధితులను లోక్ నాయక్ ఆస్పత్రికి తరలించారు. లోక్ నాయక్ ఆస్పత్రిని ప్రత్యేకించి కోవిడ్ కే కేటాయించారు. ఈ ఆస్పత్రిలో వీరికి ట్రీట్ మెంట్ అందుతోంది. జీనోమ్ సీక్వెన్సింగ్ లో వీరికి సోకింది ఒమిక్రాన్ వేరియంట్ అయితే కచ్చితంగా ఢిల్లీ కూడా అప్రమత్తం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Corona Positive : హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన 12మంది విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్

ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కొనేందుకు సమర్థవతమైన అన్ని రకాల చర్యలు, ఏర్పాట్లను చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా సోకినా..ఒమిక్రాన్ కాదని ప్రకటించారు. విదేశాల నుంచి 12 మందిలో 10 మందికి పాజిటివ్ గా తేలింది. వీరికి డెల్టా వేరియంటా? ఒమిక్రాన్ వేరియంటా ? అనేది జీనోమ్ సీక్వెన్సింగ్ లో తేలనుంది.

కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ ఢిల్లీపై చాలా ప్రభావం చూపింది. వైరస్ బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం కూడా ఏర్పాట్లను చేసింది. ఇప్పుడు వీరికి ఒమిక్రాన్ వేరియంట్ అని తెలిస్తే మాత్రం ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని కఠిన తరమైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.