Ntpc Jobs : ఎన్టీపీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల వేతనం చెల్లించనున్నారు. ఇంకా హెచ్ఆర్ ఎ, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల గరిష్ట వయస్సును 35 ఏళ్లుగా నిర్ణయించారు

Ntpc Jobs : ఎన్టీపీసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Ntpc Jobs

Ntpc Jobs : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టిపీసీ) ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. మెకానికల్ ఎగ్జిక్యూటివ్ హైడ్రో పోస్టులు 5 ఖాళీలు, సివిల్ ఎగ్జిక్యూటివ్ హైడ్రో పోస్టులు 10 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.

విద్యార్హతల విషయానికి వస్తే మెకానికల్ ఎగ్జిక్యూటివ్ హైడ్రో పోస్టులకు సంబంధించి అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బీఈ, బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. సివిల్ ఎగ్జిక్యూటివ్ హైడ్రో పోస్టులకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ,బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఉత్తరఖాండ్ లో పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 16న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల వేతనం చెల్లించనున్నారు. ఇంకా హెచ్ఆర్ ఎ, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల గరిష్ట వయస్సును 35 ఏళ్లుగా నిర్ణయించారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 300 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ, ఇతర కేటగిరీ, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://careers.ntpc.co.in/