Odisha : జీతం రూ. 4 వేల 500..ఫోర్బ్స్ మ్యాగజైన్‌‌లో ఆశా వర్కర్

ఉదయం 5 గంటలకే ఆమె దినచర్య ప్రారంభమౌతుంది. తనింటి పనులు పూర్తి చేసుకుని..నలుగురు కుటుంబసభ్యులకు ఆహారం సిద్ధం చేస్తుంది.

Odisha : జీతం రూ. 4 వేల 500..ఫోర్బ్స్ మ్యాగజైన్‌‌లో ఆశా వర్కర్

Asha Worker

Updated On : December 4, 2021 / 9:28 AM IST

Tribal Asha Worker In Forbes India : ఫోర్బ్స్ జాబితాలో ఆశా వర్కర్ కు స్థానం దక్కింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన గిరిజన ఆశా వర్కర్ చేసిన పనికి ఫోర్బ్స్ గుర్తించింది. ఫోర్బ్స్ ఇండియా డబ్ల్యు పవర్ 2021 జాబితాలో చోటు దక్కింది. ఆమె పేరు మతిల్దా. గిరిజనులు ఎక్కువగా ఉండే..సుందర్ గఢ్ జిల్లాలోని గర్ గండ్ బహల్ గ్రామానికి చెందిన వారు. ఆమె అక్కడ గత 15 సంవత్సరాలుగా ఆశా వర్కర్ గా పని చేస్తున్నారు. ఈ గ్రామంలో దాదాపు వేయి మంది జనాభా ఉంటారు. ఈమె ఒక్కరే వారి బాగోగులు చూస్తుంటారు. సైకిల్ పై ఊరంతా తిరుగుతూ..వ్యాక్సిన్లు వేయించడం, పౌష్టికాహారం అందించడం..గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు ఈమె చర్యలు తీసుకుంటున్నారు. అందుకే స్వశక్తివంతులైన మహిళల జాబితాలో చేర్చింది.

Read More : PRC Report : ఏపీలో పీఆర్సీ రగడ.. నివేదిక బహిర్గతం చేయబోమన్న ప్రభుత్వం

ఉదయం 5 గంటలకే ఆమె దినచర్య ప్రారంభమౌతుంది. తనింటి పనులు పూర్తి చేసుకుని..నలుగురు కుటుంబసభ్యులకు ఆహారం సిద్ధం చేస్తుంది. ఆశా వర్కర్ గా విధుల్లో చేరిన మొదట్లో ఎవరికైనా రోగం వస్తే..మంత్రగత్తెల వద్దకు వెళుతుండడం ఆమె గమనించారు. వారిలో అవగాహన కల్పించడానికి ఆమె కృషి చేశారు. ఆమె కృషి ఫలించింది. ఏ విధమైనా అనారోగ్యం కలిగినా..వైద్యుల వద్దకు వెళుతున్నారు. ఆశా వర్కర్ గా పని చేస్తున్న ఈమె రూ. 4 వేల 500 జీతం తీసుకుంటున్నారు.
గ్రామంలోని ప్రతింటికి వెళ్లి ఎవరైనా రోగులు ఉంటే..వారికి మందులు ఇస్తారు.

Read More : Konijeti Rosaiah Passes Away: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత

ఎవరైనా మహిళలు గర్భిణీలుగా ఉంటే వారికి సహాయం చేస్తారు. కరోనా మహమ్మారి సమయంలో…ఫ్రంట్ లైన్ వర్కర్ గా ఎనలేని సేవలందించారు. ఎన్నో ప్రాణాలు కాపాడారు. సేవలు చేస్తూ..కరోనా బారిన పడ్డారు మతిల్దా. వైరస్ ను జయించిన తర్వాత..కూర్చొలేదు. మరలా పనిలో నిమగ్నమైపోయారు. ఈ విషయం ఫోర్బ్స్ కు తెలిసింది. వృద్ధ మహిళలు, పురుషులను టీకాలు వేసేందుకు టీకా కేంద్రాలకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. తాను ఆశా వర్కర్ చేస్తున్నందుకు గర్వపడుతున్నట్లు, తన కృషి చాలామంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడిందని మతిల్దా. మతిల్దాకు స్వశక్తిమంతులైన మహిళల జాబితాలో చోటు దక్కడంపై సీఎం నవీన్ పట్నాయక్ సంతోషం వ్యక్తం చేశారు.