Old Couple Marriage: ఆమెకు 73.. ఆయనకు 69.. త్వరలోనే పెళ్లి

కనిపెంచిన బిడ్డలు రెక్కలొచ్చాక బ్రతుకుదెరువుకు విదేశాల బాట పట్టారు. బిడ్డలు ఎవరికి వారు వారి జీవితాలతో కుస్తీ పడుతుంటే ఆ వృద్ధ మనసులు ఒంటరిగా మిగిలిపోయాయి. కడవరకు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారనుకుంటే దంపతులలో ఒకరు ముందే కడతేరిపోవడంతో మిగిలిన ఆ వృద్ధ పక్షికి తోడు కరువైంది.

Old Couple Get Married: కనిపెంచిన బిడ్డలు రెక్కలొచ్చాక బ్రతుకుదెరువుకు విదేశాల బాట పట్టారు. బిడ్డలు ఎవరికి వారు వారి జీవితాలతో కుస్తీ పడుతుంటే ఆ వృద్ధ మనసులు ఒంటరిగా మిగిలిపోయాయి. కడవరకు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారనుకుంటే దంపతులలో ఒకరు ముందే కడతేరిపోవడంతో మిగిలిన ఆ వృద్ధ పక్షికి తోడు కరువైంది.

ఒంటరితనం వారిని వేధించడం వాళ్ళు బయటకు చెప్పుకోలేకపోయినా.. పరిస్థితుల కారణంగా వారిని ఒంటరిగా వదిలేసిన వారి పిల్లలే వారికి ఒక తోడు కావాలని కోరుకున్నారు. అనుకున్నదే తడవుగా అదే కారణంతో బాధ పడుతున్న మరో ఒంటరి ప్రాణాన్ని చూసి జతచేసి తృప్తి పడ్డారు. ఈ వృద్ధ పెళ్లి కర్ణాటకలో జరగనుంది.

వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో నివాసం ఉంటున్న 73 ఏళ్ల రిటైర్డు ఉపాధ్యాయురాలును 69 ఏళ్ల రిటైర్ ఇంజనీర్ పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొంత కాలంగా ఇద్దరు ఒంటరి జీవితం గడుపుతున్నారు. వృద్ధురాలి ఒంటరి తనాన్ని చూడలేని కుటుంబ సభ్యులు బామ్మను మరో పెళ్లి చేసుకోవాలని సూచించారు.

తొలుత నిరాకరించినా చివరికి ఆమె పెళ్ళికి అంగీకరించింది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు వరుడు కావాలంటూ ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన తోడుకోసం ఎదురుచూస్తున్న 69 ఏళ్ల రిటైర్డు ఇంజినీర్‌ కంటపడింది. అంతే 69 ఏళ్ల విశ్రాంత ఇంజినీర్‌ ఆమెకు ఫోన్‌ చేయగా ఇద్దరి మనసులు కలిశాయి. ఇరువైపుల కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపారు.

69 ఏళ్ల రిటైర్డ్ ఇంజనీర్ వృద్ధుడికి కూడా ఏడేళ్ల క్రితమే భార్య చనిపోగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు విదేశాలలో ఉన్నాడు. కుమారుడు తండ్రిని అక్కడకి రమ్మని బ్రతిమాలినా అందుకు వృద్ధుడు విముఖత వ్యక్తం చేస్తూ ఒంటరిగా ఉంటున్నాడు. అది చూడలేని కుమారుడే తండ్రికి మరో పెళ్లి చేయాలని భావించాడు.

అతడి ప్రోద్బలంతోనే ఈ విశ్రాంత ఇంజినీర్ పెళ్ళికి ఒకే చెప్పారు. మొత్తంగా ఇప్పుడు త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వయసులో కాస్త బామ్మనే పెద్దదైనా మనసులు కలవడంతోనే ఈ పెళ్లికి ఒకే చెప్పమని ఈ కుటుంబాలు చెప్పడం విశేషం!

ట్రెండింగ్ వార్తలు