Fuel Prices: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

Fuel Prices: మళ్లీ పెరిగిన ఇంధన ధరలు

Omcs Raise Fuel Prices Again Petrol Up By Nearly Rs 5 Diesel By Rs 6

Updated On : June 7, 2021 / 9:42 AM IST

Fuel Prices: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ)లు మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి. 27 నుంచి 28 పైసలు వరకూ వరుసగా రెండో రోజు పెంచేసి దేశ రాజధానిలో లీటరుకు రూ.95కు చేర్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే సెంచరీ మార్కు దాటేశాయి ఇంధన ధరలు.

మే 4నుంచి జూన్ 7వరకూ 21వ సార్లు పెంచిన ఇందన ధరలతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.95.37కు చేరగా, డీజిల్ ధరలు రూ.86.28గా ఉంది. ఇదిలా ఉంటే ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ.101 మార్కు దాటి రూ.101.47కు చేరింది. డీజిల్ ధరలు రూ.93.64గా ఉందని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్ సైట్ వెల్లడించింది.

చెన్నై కోల్ కతాల్లో వరుసగా రూ.96.77, రూ.95.34లుగా ఉంది. అదే విధంగా డీజిల్ ధరలు రూ.90.97, రూ.89.12గా ఉందని తెలుస్తోంది. హైదరాబాద్ లో పెట్రోల్ రూ.99.12, డీజిల్ రూ.94.05 ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.