Metro Station: మెట్రో స్టేషన్లో సూసైడ్‍కు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు

ఢిల్లీ మెట్రో రైలు స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పోలీసులు కాపాడారు. ఈ ఘటన మొత్తాన్ని 45 సెకన్ల పాటు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Metro Station: మెట్రో స్టేషన్లో సూసైడ్‍కు యత్నించిన మహిళను కాపాడిన పోలీసులు

Metro Station

Updated On : July 25, 2021 / 4:49 PM IST

Metro Station: ఢిల్లీ మెట్రో రైలు స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పోలీసులు కాపాడారు. ఈ ఘటన మొత్తాన్ని 45 సెకన్ల పాటు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆవేశంతో మెట్రో స్టేషన్ పై నుంచి దూకిన మహిళ.. గోడపై కూర్చొని ముందుకు దిగేందుకు తటపటాయిస్తూ ఉండిపోయింది. .

ఫరీదాబాద్ లోని సెక్టార్ 28వద్ద జరిగిన ఈ ఘటనపై సెక్యూరిటీ పర్సనల్స్ సకాలంలో స్పందించారు. సీఐఎస్ఎఫ్, మెట్రో స్టాఫ్ అక్కడే ఉండి ఆమెను మాటలతో ఏమరుపాటుకు గురిచేస్తుండగా ఒక పోలీస్ కానిస్టేబుల్ గోడ దూకి వచ్చి యువతి చేయి పట్టుకుని కాపాడారు. ఎట్టకేలకు యవతిని సురక్షితంగా కాపాడగా.. ధైర్యంగా గోడపై నడుచుకుంటూ వెళ్లి ఆమెను చేరుకున్న కానిస్టేబుల్ సర్ఫరాజ్ ను పోలీస్ కమిషనర్ ఓపీ సింగ్ అభినందించారు.

జీవితమంటే పోరాడటమే. వాటి నుంచి దూరంగా పోవాలని అమూల్యమైన జీవితాన్ని కోల్పోకూడదని కమిషనర్ చెప్పారు. ఇంటరాగేషన్ లో యువతి పని ఒత్తిడి కారణంగా చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు కుటుంబానికి అప్పగించారు.