Viral Video: రోడ్డుపై టపాసులు కాల్చుతున్న యువకుడిని ఢీకొట్టి దూసుకెళ్లిన కారు

ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడికి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి.

దీపావళి సందర్భంగా ఎంతో సంతోషంగా గడుపుతూ రోడ్డుపై బాణసంచా కాల్చుతున్న ఓ వ్యక్తి మీదకు మృత్యు రూపంలో దూసుకొచ్చింది ఓ కారు. అతడితో పాటు అతడి కుటుంబ సభ్యుల ఆనందాన్ని ఆవిరిచేస్తూ అతడిని విగతజీవిగా మార్చింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడికి సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీపావళి రోజు రాత్రి రోడ్డుపై పండుగ జరుపుకుంటున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

అతడి పేరు సోహమ్ పటేల్ (35) అని పోలీసులు గుర్తించారు. అతడు రోడ్డు మధ్యలోకి వెళ్లి పటాకులు కాల్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సీసీటీవీలో కనపడుతోంది.

ఒక కారు వేగంగా వచ్చి సోహమ్‌ను ఢీకొట్టడంతో అతడు కొన్ని మీటర్ల మేర ఎగిరి పడ్డాడు. అతడిని ఢీ కొట్టిన కారు ఆపకుండా దూసుకెళ్లిందని పోలీసులు తెలిపారు. కారు యజమానిని గుర్తించేందుకు అక్కడి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని అన్నారు.

దేశంలో జరుగుతున్న ప్రధాన పోరు ఈ ఇద్దరి మధ్యే: రాహుల్ గాంధీ