దేశంలో జరుగుతున్న ప్రధాన పోరు ఈ ఇద్దరి మధ్యే: రాహుల్ గాంధీ
తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి వయనాడ్ ఉప ఎన్నిక ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి వయనాడ్ ఉప ఎన్నిక ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు.
మనం రాజకీయ పోరాటం చేస్తున్నాం అనేది వాస్తవమని రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలో జరుగుతున్న ప్రధాన పోరు రెండు భావజాలాల వారి మధ్య ఉందని చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలనుకునే వారికి, రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలనుకునే వారికి మధ్య ఈ పోరు జరుగుతోందని అన్నారు.
రాజ్యాంగం ప్రజలు ఏ రాష్ట్రం నుంచి వచ్చారో పట్టించుకోదని, అలాగే, మహిళలా, పురుషులా అన్నది, ప్రజలది ఏ భాష అన్న విషయాన్ని, ఏ మతం అన్న అంశాన్ని పట్టించుడకోదని చెప్పారు. రాజ్యాంగం ప్రతి ఒక్కరినీ గౌరవిస్తుందని చెప్పారు.
“అధికారికంగా మీకు ఓ కొత్త పార్లమెంటు సభ్యుడు ఉంటారు. అయితే, దేశంలో ఇద్దరు పార్లమెంటు సభ్యులు ఉండే ఏకైక నియోజకవర్గం వయనాడ్ అవుతుంది. మీ తరఫున పార్లమెంట్‌లోకి వెళ్లడానికి మీకు రెండు మార్గాలు ఉంటాయి” అని అన్నారు. తాను వయనాడ్‌కు రాజీనామా చేసినప్పటికీ తాను కూడా అక్కడి ప్రజల తరఫున పార్లమెంటులో మాట్లాడతానన్న ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి తర్వాత..