వణుకు పుట్టించే ఘటన: దాడి చేస్తుందనుకుంటే.. చిన్నారిని రక్షించింది

అది ఫారెస్ట్ ఏరియా.. మధ్యలో ఓ చిన్న గ్రామం.. రెండింటీని డివైడ్ చేస్తూ నేషనల్ హైవే 31. ఇదే మార్గంలో వచ్చేపోయేవారిపై ఏనుగుల గుంపు దాడి చేస్తుంటాయి. ఈ మార్గంలో వెళ్లేవారంతా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని రోడ్డు దాటుతుంటారు.

  • Published By: sreehari ,Published On : February 23, 2019 / 07:35 AM IST
వణుకు పుట్టించే ఘటన: దాడి చేస్తుందనుకుంటే.. చిన్నారిని రక్షించింది

Updated On : February 23, 2019 / 7:35 AM IST

అది ఫారెస్ట్ ఏరియా.. మధ్యలో ఓ చిన్న గ్రామం.. రెండింటీని డివైడ్ చేస్తూ నేషనల్ హైవే 31. ఇదే మార్గంలో వచ్చేపోయేవారిపై ఏనుగుల గుంపు దాడి చేస్తుంటాయి. ఈ మార్గంలో వెళ్లేవారంతా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని రోడ్డు దాటుతుంటారు.

అది ఫారెస్ట్ ఏరియా.. మధ్యలో ఓ చిన్న గ్రామం.. రెండింటీని డివైడ్ చేస్తూ నేషనల్ హైవే 31. ఇదే మార్గంలో వచ్చేపోయేవారిపై ఏనుగుల గుంపు దాడి చేస్తుంటాయి. ఈ మార్గంలో వెళ్లేవారంతా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని రోడ్డు దాటుతుంటారు. గురువారం (ఫిబ్రవరి 21)న వెస్ట్ బెంగాల్ లోని జలపాయిగిరి జిల్లాలో జరిగిన షాకింగ్ ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణంగా సినిమాల్లో జంతువులు మనుషుల ప్రాణాలను రక్షించడం చూసి ఉంటారు. రియల్ గా ఎప్పుడూ చూసి ఉండరు. గరుమర ఫారెస్ట్ సమీపంలోని నేషనల్ హైవేపై జరిగిన ఘటన చూస్తే వణికిపోతారంతే.

ఫారెస్ట్ లోని ఓ దేవాలయానికి వెళ్లిన కుటుంబ సభ్యులు పూజ అనంతరం తిరిగి లతగురి గ్రామానికి బయల్దేరారు. నీతూ ఘోష్ అనే బిజినెస్ మ్యాన్ తన భార్యాబిడ్డలతో కలిసి స్కూటర్ మీద వెళ్తున్నాడు. మార్గం మధ్యలో ఒక్కసారిగా ఏనుగుల గుంపు ఎదురైంది. ఏనుగుల గుంపు రోడ్డు దాటుతుండటం చూసి సడన్ గా స్కూటర్ బ్రేక్ వేశాడు. ఏనుగులు రోడ్డుదాటి వెళ్లిపోగానే వెంటనే స్కూటర్ స్టార్ట్ చేశాడు. అదే సమయానికి మరో ఏనుగుల గుంపు రోడ్డు పైకి వచ్చింది. గమనించని ఘోష్ గజరాజులకు అతి సమీపంగా స్కూటర్ తీసుకెళ్లాడు. ఏనుగుల గుంపును ఒక్కసారిగా చూసేసరికి స్కూటర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో స్కూటర్ పై నుంచి ముగ్గురు కిందపడ్డారు. నడిరోడ్డుపై ఏనుగుల గుంపు వారికి దగ్గరగా వచ్చింది. 

ఎక్కడ దాడి చేస్తాయోనని నీతూ ఘోష్ వణికిపోయాడు. భార్య తిత్లీ, నాలుగేళ్ల కుమార్తె అహానాను ఏనుగుల గుంపు నుంచి ఎలా కాపాడుకోవాలో పాలుపోలేదు. ఇంతలో ఏనుగుల మంద నుంచి ఓ ఏనుగు ముందుకొచ్చింది. ఇతర ఏనుగుల మంద నుంచి చిన్నారిని కాపాడింది. రోడ్డుపై పడిపోయిన చిన్నారిని తన నాలుగు కాళ్ల మధ్యలో ఉండేలా నిలబడింది. ఏనుగుల గుంపు రోడ్డు దాటేంత వరకు అలాగే ఉంది. ఏనుగుల మంద రావడం చూసి దూరంగా ఆగిపోయిన ఓ ట్రక్కు డ్రైవర్ చూస్తు ఉండిపోయాడు. ఏనుగులను బెదరగొట్టేందుకు ప్రయత్నించాడు. ట్రాక్టర్ హార్న్ పదే పదే మోగించాడు. ఏనుగులు అక్కడి నుంచి ఫారెస్ట్ లోకి వెళ్లిపోయాయి. వెంటనే ట్రక్కు డ్రైవర్.. గాయపడిన ఘోష్ కుటుంబ సభ్యులను సమీప ఆస్పత్రికి తరలించాడు. చిన్నారి అహానకు స్వల్ప గాయాలు మాత్రమే అయినట్టు వైద్యులు తెలిపారు.