వన్ నేషన్.. వన్ కార్డ్: ఉపయోగాలు ఇవే!

వన్ నేషన్.. వన్ కార్డ్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా అన్నీ ట్రాన్స్‌పోర్టులకు ఒకే కార్డును అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

  • Published By: vamsi ,Published On : March 7, 2019 / 10:22 AM IST
వన్ నేషన్.. వన్ కార్డ్: ఉపయోగాలు ఇవే!

వన్ నేషన్.. వన్ కార్డ్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా అన్నీ ట్రాన్స్‌పోర్టులకు ఒకే కార్డును అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

వన్ నేషన్.. వన్ కార్డ్ పేరుతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా అన్నీ ట్రాన్స్‌పోర్టులకు ఒకే కార్డును అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. భారతదేశపు తొలి నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సీఎంసీ) ఇది. దీని వల్ల ప్రయాణికులు దేశంలో ఎక్కడికైనా సులభంగా ప్రయాణించొచ్చు. బస్సు ట్రావెల్, టోల్ ట్యాక్సులు, పార్కింగ్ చార్జీలు, రిటైల్ షాపింగ్, క్యాష్ విత్‌డ్రా వంటి ప్రత్యేకతలు ఈ కార్డులో ఉన్నాయి.
Also Read : ఈ లోకంలో లేడు : PubG ఆడుతూ.. నీళ్లకు బదులు యాసిడ్ తాగాడు

విదేశీ టెక్నాలజీపై ఆధారపడాల్సిన అవసరం లేదని ఈ కార్డు ఓపెనింగ్ సంధర్భంగా మోడీ చెప్పారు. ఇది మేడిన్ ఇండియా కార్డ్ అని, ప్రపంచంలోని కొద్ది దేశాలు మాత్రమే ఈ సాంకేతికతను వాడుతున్నట్లు మోడీ వెల్లడించారు. దీనిని Ministry of Housing and Urban Affairs(MoHUA) డెవలప్ చేసింది. ప్రస్తుతం మెట్రో రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసుల్లో మాత్రమే స్మార్ట్ కార్డు విధానం నడుస్తోంది.

వన్ నేషన్.. వన్ కార్డ్ ఉపయోగాలు
-డెబిట్, క్రెడిట్ లేదా ప్రిపెయిడ్ కార్డు రూపంలో బ్యాంకులు ఈ కార్డును జారీ చేస్తాయి.
-రూపే డెబిట్/క్రెడిట్ కార్డు మాదిరే ఉంటుంది. 25కు పైగా బ్యాంకుల్లో ఈ కార్డులు పొందొచ్చు. (ఎస్‌బీఐ, అలహాబాద్ బ్యాంగ్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఇలా 25బ్యాంకులు ఉన్నాయి.)
-మెట్రో, బస్సు, రైల్వేస్, రిటైల్ షాపింగ్ వంటి వాటికి ఈ కార్డు ద్వారా చెల్లింపుల జరపే అవకాశం ఉంటుంది.
-టోల్ ప్లాజాల బిల్లులు, పార్కింగ్ చార్జీలు కూడా ఈ కార్డు ద్వారా చెల్లించుకోవచ్చు. 
-కార్డు ద్వారా చెల్లింపులతో క్యాష్‌బ్యాక్ కూడా పొందే ఏర్పాటు ఉంది. విదేశాల్లో ఏటీఎం ద్వారా క్యాష్ విత్‌డ్రా చేసుకుంటే 5 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. మర్చంట్ ఔట్లెట్స్‌లో చెల్లింపులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది. 
-స్వాగత్, స్వీకార్ వంటి వాటిని కూడా ఈ కార్డు సపోర్ట్ చేస్తుంది.  
-టీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కూడా ఈ కార్డును పొందవచ్చు. మేకిన్ ఇండియాలో భాగంగా దీనిని రూపొందించారు.
Also Read : ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం