Jamili Elections Bill: రేపు పార్లమెంటు ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు

రాజ్యాంగం 129వ సవరణ బిల్లు పేరుతో జమిలి బిల్లును లోక్ సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ప్రవేశపెట్టనున్నారు.

Lok Sabha

Jamili Elections Bill: దేశంలో జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులకు ఈనెల 12న కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వీటిలో లోకసభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక బిల్లు, జమిలి ఎన్నికలకోసం అవసరమైన రాజ్యాంగ సవరణలకు కోసం మరో బిల్లు ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా న్యాయశాఖ బిల్లు రూపొందించింది. అయితే, సోమవారం పార్లమెంట్ ముందుకు వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు రానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. తాజాగా.. మంగళవారం పార్లమెంట్ లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Jamili Election: జమిలి ఎన్నికలపై కేంద్రం యూటర్న్..! ఆ రెండు బిల్లులు తొలగింపు

రాజ్యాంగం 129వ సవరణ బిల్లు పేరుతో జమిలి బిల్లును లోక్ సభలో న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ ప్రవేశపెట్టనున్నారు. లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన తరువాత కేంద్రం జేపీసీ వేయనుంది. జేపీసీలో బీజేపీ, కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు ఉండనున్నారు. మరోవైపు శుక్రవారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి.