Jamili Election: జమిలి ఎన్నికలపై కేంద్రం యూటర్న్..! ఆ రెండు బిల్లులు తొలగింపు
జమిలి ఎన్నికల ఉద్దేశం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్ సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. అయితే, గతంలో ఇలానే దేశవ్యాప్తంగా

Lok Sabha
Jamili Election Bill: జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈనెల 16న లోక్ సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లులు తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులకు ఈనెల 12న కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఆ బిల్లులను లోక్ సభ బిజినెస్ జాబితాలో కూడా పొందుపర్చారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ బిల్లు పెడతారని కేంద్రం పేర్కొంది. అయితే, తాజాగా రివైజ్డ్ చేసిన లోక్ సభ బిజినెస్ లో జమిలి ఎన్నికల బిల్లులు లేవని తెలుస్తోంది. శుక్రవారం (ఈనెల 20)తో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో శీతాకాల సమావేశాల్లో బిల్లులు పెట్టడంపై సందిగ్ధత నెలకొంది.
Also Read: KTR: ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
జమిలి ఎన్నికల ఉద్దేశం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్ సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. అయితే, గతంలో ఇలానే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగేవి. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్ సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అనంతరం కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు ప్రక్రియ గాడితప్పింది. ఈ క్రమంలో లోక్ సభకు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. అయితే, తాజాగా మళ్లీ జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం చర్యలు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే ఈనెల 12న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Also Read: Jamili Elections Bill : వన్ నేషన్ – వన్ ఎలక్షన్.. జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం