One Nation-One Election : జమిలి ఎన్నికలపై తేల్చి చెప్పిన కేంద్రం

లోక్‌సభతో  పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం  లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్రం వెల్లడించింది.

One Nation-One Election :  లోక్‌సభతో  పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం  లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్రం వెల్లడించింది. లోక్‌సభలో ఈరోజు ఎంపీ భగీరథచౌదరి  జమిలి ఎన్నికల పై అడిగిన ప్రశ్నకు  కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం చెపుతూ ….. ఈ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు వెల్లడించారు.

స్టాండింగ్ కమిటీ తన నివేదికలో కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసిందని… ఆ నివేదిక ఆధారంగా లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తూ ఒక ప్రణాళికను తయారు చేసే పనిలో నిమగ్నమైందని ఆయన తెలిపారు.  తరచుగా వచ్చే ఎన్నికల వల్ల నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చవుతుందని పేర్కొందని…2014-22 మధ్యకాలంలో 50 అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో వివరించింది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నికల నిర్వహణ కోసం రూ. 7వేల కోట్లకు పైగా ధనం ఖర్చు పెట్టాల్సి వచ్చిందని కిరణ్ రిజిజు వివరించారు.

Also Read : CBI Probe: కేజ్రీవాల్ ప్ర‌వేశ‌పెట్టిన మ‌ద్యం పాల‌సీపై సీబీఐ విచార‌ణ‌కు లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌ సిఫార్సు

 

ట్రెండింగ్ వార్తలు