కరోనా ఎఫెక్ట్..WhatsApp చేయండి : సరుకులు ఇంటికే తెస్తాం

  • Published By: madhu ,Published On : April 22, 2020 / 01:36 AM IST
కరోనా ఎఫెక్ట్..WhatsApp చేయండి : సరుకులు ఇంటికే తెస్తాం

Updated On : April 22, 2020 / 1:36 AM IST

కరోనా వైరస్ ను తరమికొట్టడానికి ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. సోషల్ డిస్టెన్స్ పాటించడం, ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రాకపోవడమే వైరస్ వ్యాప్తి చెందకుండా చేయవచ్చని ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. దీంతో దేశాలు లాక్ డౌన్ విధించాయి. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగుకుండా ఏర్పాట్లు చేస్తున్నాయి. భారతదేశం కూడా లాక్ డౌన్ కొనసాగిస్తోంది.

మే 03వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకు కొన్ని రాష్ట్రాలు సాంకేతికతను వాడుకుంటున్నాయి. ఇలాగే కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. మీరు ఇంటి నుంచి బయటకు రాకండి…మీకు కావాల్సిన సరుకులు తమకు తెలియచేస్తే..వాటిని తీసుకొచ్చి ఇస్తాం..అంటోది. ప్రత్యేకంగా watsup నెంబర్ ను కేటాయించింది.

ఏ ఏ సరుకులు కావాలో వాటిని వాట్సాప్ కు పంపిస్తే సరిపోతుంది. స్థానికంగా ఉన్న ఏజెంట్లు వాటిని తీసుకొస్తారు. ఈ మేరకు సీఎం యడియూరప్ప 08061914960 హెల్ప్ లైన్ ప్రారంభించారు. ఇందుకోసం వివిధ ప్రైవేటు సంస్థల నుంచి బెంగళూరు నగరంలో దాదాపు 5 వేల మంది ఏజెంట్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఇలా చేయడం వల్ల ప్రజలు ఇంటి నుంచి బయటకు రారని చెబుతున్నారు. 

సరుకులు ఎలా పంపించాలి :-
Step 1 : 0806 1914 960కు సెల్ లో సేవ్ చేసుకోవాలి. Step 2 : హెల్ప్ లైన్ నెంబర్ కు HI మేసెజ్ చేయ్యాలి. Step 3 : లోకేషన్ లేదా అడ్రస్ షేర్ చేయాలి. Step 4 : నిత్యావసర సరుకులు కావాలా ? మెడిసన్ కావాలా ? అని అడుగుతుంది. Step 5 : ఏవైతో కావాలో వాటిని టైప్ చేయడం కాని..పేపర్ పై రాసి (ఇమేజ్) పంపించాలి. Step 6 : ఆర్డర్ తీసుకున్న తర్వాత..ఒక రిప్లై వస్తుంది. Step 7 : సదరు ఏజెంట్ సరుకులు తీసుకొచ్చి ఇస్తారు. Step 8 : బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. అయితే..Step 9 : డెలివరీ ఛార్జీల కింద రూ. 10 చెల్లించాల్సి ఉంటుంది.