Oscar winning : ఆస్కార్ అవార్డు గ్రహీత స్మైల్ పింకీ ఫేమ్ ఇంటికి కూల్చివేత నోటీసు

ఆస్కార్ అవార్డు గ్రహీత స్మైల్ పింకీ ఫేమ్ ఇంటికి అధికారులు కూల్చివేత నోటీసు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీర్జాపూర్‌లో పింకీ సోంకర్ ఇంటిని కూల్చివేయడానికి అటవీ శాఖ నోటీసు జారీ చేసింది. పింకీ తన జీవితం ఆధారంగా తీసిన స్మైల్ పింకీ డాక్యుమెంటరీకి 2008వ సంవత్సరంలో ఆస్కార్ అవార్డు లభించింది....

Oscar winning :  ఆస్కార్ అవార్డు గ్రహీత స్మైల్ పింకీ ఫేమ్ ఇంటికి కూల్చివేత నోటీసు

Oscar winning Smile Pinki

Oscar winning : ఆస్కార్ అవార్డు గ్రహీత స్మైల్ పింకీ ఫేమ్ ఇంటికి అధికారులు కూల్చివేత నోటీసు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీర్జాపూర్‌లో పింకీ సోంకర్ ఇంటిని కూల్చివేయడానికి అటవీ శాఖ నోటీసు జారీ చేసింది. పింకీ తన జీవితం ఆధారంగా తీసిన స్మైల్ పింకీ డాక్యుమెంటరీకి 2008వ సంవత్సరంలో ఆస్కార్ అవార్డు లభించింది. (Oscar winning Smile Pinki fame) పింకీతో పాటు, ఆమె గ్రామంలో నివసిస్తున్న 30 మందికి కూల్చివేత నోటీసులు అందజేశారు. (house gets demolition notice in Mirzapur) అటవీ అధికారులు వారి ఇళ్లను అక్రమ ఆస్తులుగా అభివర్ణించారు.

Pakistani politicians : లైవ్ టీవీ షోలో పాక్ రాజకీయ నేతల ముష్టి యుద్ధం

పింకీ మీర్జాపూర్ జిల్లాలోని రాంపూర్ ధాభి గ్రామ నివాసి. పింకీతో పాటు మరికొందరు గ్రామస్థులు ఇళ్లు నిర్మించుకున్న స్థలం అటవీ శాఖకు చెందినదని నోటీసులో పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ స్థలం అటవీ శాఖకు చెందినదని గ్రామస్థులకు చెప్పలేదని పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ తెలిపారు.పింకీ సోంకర్‌ తీసిన డాక్యుమెంటరీకి ఆస్కార్‌ అవార్డు రావడంతో అటవీశాఖ అధికారులు ఆ భూమిని తమకు అందించారని నోటీసు అందుకున్న గ్రామస్థులు వివరించారు.

Heavy Rains : నీటమునిగిన న్యూయార్క్ నగరం..ఎమర్జెన్సీ ప్రకటన

కూల్చివేత నోటీసును పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని, న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ప్రియాంక నిరంజన్ చెప్పారు. దీనికి తార్కిక, న్యాయబద్ధమైన పరిష్కారం ద్వారా సమస్యను పరిష్కరిస్తామని, ఎవరూ ఇబ్బంది పడవద్దని, రెవెన్యూ, అటవీ శాఖలకు సమాచారం అందించామని కలెక్టర్ తెలిపారు.