ఓ వైపు దేశంలోని అన్నీ రాష్ట్రాలు కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మాల్స్,సినిమా థియేటర్లు వంటివన్నీ మూసివేసి, పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటం లేదా ఎక్కువమంది ఒక చోట చేరవద్దు అని వీలైతే పెళ్లిళ్లు,నిశ్చితార్థాలు వంటివి కూడా వాయిదా వేసుకోవాలని సూచనలు చేస్తున్న సమయంలో…ప్రభుత్వ సలహాలను ధిక్కరించి పౌరసత్వ సవరణ చట్టం(CAA)కు వ్యతిరేకంగా 5,000 మందికి పైగా ప్రజలు ఈ రోజు చెన్నైలో వీధుల్లోకి వచ్చారు.
వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి), నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పిఆర్) కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేస్తూ మెరీనా బీచ్ సమీపంలోని చెపాక్ ప్రాంతంలో భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. నిరసనకారులందరూ…తౌహీత్ జమాత్ గ్రూప్ సభ్యులే. వీళ్లు తమిళనాడులోని ఇతర జిల్లాల్లో ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించారు. కరోనావైరస్ మూడు ప్రాణాలను తీసినప్పటికీ, పౌరసత్వ చట్ట నిరసనలు దేశవ్యాప్తంగా 80 మంది ప్రాణాలు కోల్పోయాయి అంటూ సీఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసనకారులు నినాదాలు చేశారు.
అయితే మంగళవారం రాత్రి….సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో షాహిన్ బాగ్ ఏరియాలో చేస్తున్న ఆందోళన మాదిరిగానే చెన్నైకి చెందిన షాహీన్ బాగ్ అని పిలువబడే వాషర్ మన్ పేట్ వద్ద ముస్లిం మహిళలు 33 రోజుల నిరసనను కరోనా వైరస్ పై దేశం చేసిన పోరాటానికి సంఘీభావం తెలిపారు. ప్రతిరోజూ సుమారు 3,500 మంది ముస్లిం మహిళలు అక్కడ గుమిగూడతారు. వాళ్లు తమ ఆందోళనను నిలిపివేయాలని డిఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్, నటుడు-రాజకీయ నాయకుడు కమల్ హాసన్ కూడా నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.
కరోనావైరస్ వ్యాప్తిపై పోరాడటానికి తమిళనాడు పాక్షిక లాక్ డౌన్ లో ఉంది. పాఠశాలలు, కళాశాలలు, థియేటర్లు, మాల్స్, జిమ్‌లు, హోటళ్ళు మరియు రిసార్ట్‌లు మార్చి 31 వరకు మూసివేయబడ్డాయి. ఈ రోజు, తంజావూరులో అధికారులు ప్రపంచ ప్రఖ్యాత ఆలయాన్ని సందర్శకులకు మూసివేశారు. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటం లేదా ఎక్కువమంది ఒక చోట చేరవద్దు అని వీలైతే పెళ్లిళ్లు,నిశ్చితార్థాలు వంటివి కూడా వాయిదా వేసుకోవాలని,ప్రయాణాలు కూడా మానుకోవాలని తమిళనాడు ప్రభుత్వం సలహా ఇచ్చినప్పటికీ…ఇవాళ చెన్నైలో 5,000 మందికి పైగా ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడం చూసి దేశ ప్రజలందరూ షాక్ అయ్యారు.
ఓవైపు భారత్ లో చాపకింద నీరులా కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో ఈ పిచ్చి పనేంటి అని వారిపై ఆగ్రహాం వ్యక్తమవుతుంది. భారత్ లో ప్రస్తుతం కరోనా 2 వ దశలో (వైరస్ ఇప్పటికీ స్థానికంగా వ్యాప్తి చెందుతోంది)ఉంది. బహిరంగ ప్రదేశాలను మూసివేయడంతో సహా దాని వ్యాప్తిని ఆపడానికి భారత్ అనేక చర్యలు ఇంకా తీసుకుటుంది. మరిన్ని కఠిన చర్యలకు కూడా రెడీగా ఉంది. భారత్ లో ఇప్పటివరకు 152మందికి కరోన సోకినట్లు నిర్థారణ అయింది.