OYO Ritesh Agarwal : ఓయో వ్యవస్ధాపకుడు రితేశ్ అగర్వాల్ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. రితేశ్ తండ్రి రమేశ్ అగర్వాల్ మరణించారు. గురుగ్రామ్ లోని తన ఇంట్లోని 20వ అంతస్తు నుంచి కిందపడి ఆయన మృతి చెందారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇటీవలే రితేశ్ పెళ్లి ఘనంగా జరిగింది. ఇంతలోనే ఆయన ఇంట్లో విషాదం అలుముకుంది.
శుక్రవారం మధ్యాహ్నం రమేష్ అగర్వాల్ 20వ అంతస్తు బాల్కనీ నుంచి కిందపడి మరణించినట్టు తమకు సమాచారం అందిందని గురుగావ్ ఈస్ట్ డీసీపీ తెలిపారు. ఆ సమయంలో ఆయన భార్య, కుమారుడు రితేష్ అగ్వారాల్, కోడలు గీతాన్ష్ సూద్ ఇంట్లోనే ఉన్నారని తెలిపారు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపామన్నారు. మరణానికి దారితీసిన పరిస్థితులపై రమేష్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేదని తెలిపారు.
Also Read..Marriage Cancel: వధువు ముఖానికి వెరైటీ మేకప్.. పెళ్లివద్దంటూ వెళ్లిపోయిన వరుడు
కాగా..రితేష్ అగర్వాల్‌కు ఇటీవల ఫార్మేషన్ వెంచర్స్ డైరెక్టర్ గీతాన్ష సూద్‌తో వివాహం కాగా ఢిల్లీలో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్షన్‌కు బిలియనీర్ ఇన్వెస్టర్, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఫౌండర్ మసయోషి సాన్, సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రముఖ స్టార్టప్ ఫౌండర్లు, ఇన్వెస్టర్లు కూడా హాజరయ్యారు. వివాహం జరిగిన కొన్ని రోజులకే ఆ ఇంట్లో విషాద ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. తమకు మార్గదర్శి, నిరంతరం స్ఫూర్తి రగిలించే తండ్రి రమేశ్ అగర్వాల్ ఈరోజు మరణించారని భారమైన హృదయంతో తానూ, తన కుటుంబం వెల్లడిస్తున్నామని రితేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
నా తండ్రి మరణం నా కుటుంబానికి తీరని లోటు అని రితీశ్ అగర్వాల్ తెలిపారు. “నాకు, నా కుటుంబానికి ఆశాజ్యోతి, బలం నాన్నగారే. ఆయన ఈరోజు కన్నుమూయడం మమ్మల్ని తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది. నాన్నగారు పూర్తి జీవితం గడిపారు. ప్రతిరోజు నాతో పాటు ఎందరెందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన లేని లోటు మా కుటుంబానికి ఎప్పటికీ తీరదు. ఒడిదుడుకుల్లోనూ నాన్నగారు ఎంతో నిబ్బరంగా ఉండటం మేము చూశాం. ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకువెళ్తాం. ప్రస్తుత విషాద సమయంలో ప్రతి ఒక్కరూ తమ ప్రైవసీని గౌరవించాలని కోరుకుంటున్నాం” అని ఆ ప్రకటనలో రితేష్ అగర్వాల్ విజ్ఞప్తి చేశారు.
Also Read..Nagpur: ప్రాణం తీసిన వయాగ్రా.. రెండు మాత్రలు వేసుకుని వ్యక్తి మృతి
సెక్టార్ 54, గురుగ్రామ్‌లోని DLF ది క్రెస్ట్ సొసైటీ 20వ అంతస్తు నుండి ఒక వ్యక్తి పడిపోయినట్లు మధ్యాహ్నం 1 గంటకు DLF సెక్యూరిటీ నుండి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం రమేశ్ అగర్వాల్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..Mumbai: బాత్‌రూమ్‌లో దంపతుల అనుమానాస్పద మృతి.. గీజరే కారణమా?