Fawad Hussain
Chandrayaan-3 Mission : భారత చంద్రయాన్ -3 మిషన్‌కు పాకిస్థాన్‌లోని సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ప్రశంసించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి సూచించారు. ఈ మిషన్‌ను మానవజాతికి చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణిస్తూ భారతీయ శాస్త్రవేత్తలు, అంతరిక్ష సంఘాన్ని కూడా ఆయన అభినందించారు. (Pak Ex Minister Praises Chandrayaan-3 Mission)
Cricket Legend : జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూత
‘‘పాక్ మీడియా రేపు సాయంత్రం 6:15 గంటలకు #చంద్రయాన్ మూన్ ల్యాండింగ్‌ను ప్రత్యక్షంగా చూపించాలి, ఇండియాకు అభినందనలు’’ అని ఫవాద్ పేర్కొన్నారు. చంద్రుని మిషన్ చంద్రయాన్ -3 ఈ సాయంత్రం చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతుండగా భారతదేశ ప్రజలు ఉత్సాహంగా ప్రార్థనలు చేస్తున్నారు. రష్యా చంద్ర మిషన్ లూనా-25 ల్యాండింగ్ సమయంలో ఆదివారం చంద్రుని ఉపరితలంపై కూలిపోయిన ఘటనతో ఉత్కంఠ నెలకొంది.
Jai Ho ISRO : చంద్రయాన్ ల్యాండింగ్ సందర్భంగా సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పం
చంద్రయాన్-2 నుంచి తాము నేర్చుకున్న పాఠాలన్నింటినీ శాస్త్రవేత్తలు పొందుపరిచినందున ల్యాండింగ్ లో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందని అంతరిక్ష సంస్థ ఇస్రో విశ్వాసం వ్యక్తం చేసింది. ఇస్రో రెండవ ప్రయత్నంలో రోబోటిక్ లూనార్ రోవర్‌ను ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైతే, అమెరికా తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్-ల్యాండింగ్ సాంకేతికతను సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం నిలవనుంది.