పాకిస్తాన్ అధికారికంగా బీజేపీతో కలిసింది

భారత్ లో బీజేపీ మరోసారి విజయం సాధించి మళ్లీ నరేంద్రమోడీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పాక్ అధ్యక్ష్యుడు ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించాయి.

భారత్ లో బీజేపీ మరోసారి విజయం సాధించి మళ్లీ నరేంద్రమోడీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పాక్ అధ్యక్ష్యుడు ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించాయి.

భారత్ లో బీజేపీ మరోసారి విజయం సాధించి మళ్లీ నరేంద్రమోడీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పాక్ అధ్యక్ష్యుడు ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించాయి. పాకిస్తాన్ ఇప్పుడు అధికారికంగా బీజేపీతో కలిసిందని కాంగ్రెస్ ఆరోపించింది.

మోడీకి ఓటు వేయడమంటే పాకిస్తాన్ కు ఓటు వేసినట్లేనని ఇమ్రాన్ ఖాన్ అంటున్నారని కాంగ్రెస్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా విమర్శించారు.నిజం బహిరంగంగా బయటపడిందని ఆయన అన్నారు.మోడీకి మొదట పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై ప్రేమ ఉండేదని,ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఆయన ఆప్తమిత్రుడని సుర్జేవాలా ట్వీట్ చేశారు.
Read Also : వారణాశిలో ఏప్రిల్-26న మోడీ నామినేషన్

నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా బీజేపీపై విమర్శలు గుప్పించారు.ఇప్పుడు చెప్పండి ఎవరు టుక్డే టుక్డే గ్యాంగ్ అని ఆయన ప్రశ్నించారు.జరుగుతున్న పరిణామాలన్నీ బీజేపీ భక్తులను కన్ఫ్యూజన్ కు గురిచేస్తున్నాయని కశ్మీర్ మాజీ సీఎం మెహబూబ ముఫ్తీ అన్నారు.ఇమ్రాన్ ఖాన్ ను పొగడాలా,వద్దా అని తమ తెలివికి పదునుపెడుతున్నారన్నారు.