Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంపై దాడికి జైషే మహమ్మద్ కుట్ర.. నిఘా వర్గాల వెల్లడి

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరంపై దాడికి పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఆత్మాహుతి దాడి ద్వారా అయోధ్య రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని జైషే మహమ్మద్ ప్రయత్నిస్తోంది.

Ayodhya Ram Mandir: భారత్‌పై పాక్ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. తీవ్రవాద సంస్థల ద్వారా ఇండియాలో విధ్వంసం సృష్టించాలని పాక్ ప్రయత్నిస్తోంది. తాజాగా మరో పాక్ తీవ్రవాద సంస్థకు చెందిన కుట్ర బయటపడింది.

Chandrababu Naidu: పీలేరులో ‘చంద్రబాబు గో బ్యాక్’ అంటూ ఫ్లెక్సీల కలకలం

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామ మందిరంపై దాడికి పాక్ తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఆత్మాహుతి దాడి ద్వారా అయోధ్య రామ మందిరాన్ని ధ్వంసం చేయాలని జైషే మహమ్మద్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికీ ఈ సంస్థ తీవ్రవాదుల్ని పంపాలని ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నేపాల్ ద్వారా ఒక ప్రత్యేక ఆత్మాహుతి బృందాన్ని భారత్ పంపించేందుకు ప్రయత్నించింది.

Chiranjeevi : ఇప్పటి జనరేషన్ అయినా ఇలా చేయండి.. నాన్నని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన చిరంజీవి..

ఆయుధాల్ని కూడా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించింది. అయోధ్య మందిరంపై దాడి చేయడం ద్వారా దేశంలో హిందూ–ముస్లింల మధ్య చిచ్చుపెట్టి, మత విద్వేషాలు రెచ్చగొట్టాలనేది కూడా తీవ్రవాద సంస్థ వ్యూహంగా తెలుస్తోంది. ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు ప్రతీకారంగా ఈ దాడులు చేయాలని జైషే మహమ్మద్ సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రస్తుతం రామ మందిరం నిర్మాణం జరుగుతోంది.

Nepal Plane Crash History : నేపాల్ లో అనేక విమాన ప్రమాదాలు.. ఎన్ని విమానాలు కుప్పకూలాయి? ఎంత మంది చనిపోయారు?

ఇక్కడ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. దాదాపు 3,000 మంది సిబ్బంది భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. నిర్మాణంలో 300 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ప్రతి రోజూ ఈ మందిరాన్ని వేలాది మంది ఇప్పటికే దర్శిస్తున్నారు. వచ్చే జనవరి నాటికి ఆలయం ప్రారంభమై, భక్తులకు అందుబాటులోకి వస్తుంది.

 

ట్రెండింగ్ వార్తలు