PAN-Aadhaar: ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయని వారికి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ హెచ్చరిక జారీ చేసింది. 2023 మార్చి 31లోపు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లింక్ చేయకపోతే పాన్ నిరుపయోగంగా మారుతుందని హెచ్చరించింది. ఏప్రిల్ 1 నుంచి పాన్ రద్దవుతుందని తెలిపింది. పాన్-ఆధార్ లింక్ లేని వాళ్లు నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించింది.
United States: అమెరికాలో మంచు తుపాన్ ధాటికి 18 మంది మృతి.. కరెంటు లేక చీకట్లోనే 17 లక్షల మంది
‘ఐటీ యాక్ట్,1961’ ప్రకారం ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి అని సూచించింది. నోటిఫికేషన్ నెం.37/2017 ప్రకారం.. పన్ను మినహాయింపు పరిధిలోకి రానివాళ్లు కూడా నిర్ణీత గడువులోగా ఆధార్ లింక్ చేసుకోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ గతంలోనే సూచించింది. అంటే అసోం, మేఘాలయ, జమ్ము-కాశ్మీర్ ప్రాంతాల్లో నివసించే వాళ్లు, నానె రెసిడెంట్స్, 80 ఏళ్లు దాటిన వాళ్లు పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తారు. ఐటీ శాఖ్ వెబ్‌సైట్ ద్వారా ఆధార్ లింక్ చేసుకోవడం చాలా సులభం. గతంలోనే ఆధార్ లింక్ చేసుకునేందుకు ఐటీ శాఖ గడువిచ్చింది. అయితే, ఈ గడువు ఈ ఏడాది మార్చి 31నే పూర్తైంది. ఆ తర్వాత రూ.500 అపరాధ రుసుముతో జూన్ 30 వరకు గడువిచ్చింది.
అనంతరం జూలై 1 నుంచి వెయ్యి రూపాయల అపరాధ రుసుము చెల్లించి, పాన్-ఆధార్ లింక్ చేసే అవకాశం కల్పించింది ఐటీ శాఖ. ఈ గడువు వచ్చే మార్చితో పూర్తవుంది. అది కూడా పూర్తైతే పాన్ నిరుపయోగం అవుతుంది. ఆధార్ లింక్ లేకుండా ఐటీ రిటర్న్ దాఖలు చేసే అవకాశం లేదు. అలాగే ఐటీ శాఖ రీఫండ్స్ కూడా చేయదు. అదనపు పన్నులు కూడా వసూలు చేస్తారు.