Parliament : లోక్‌సభ పోడియంలో TRS నిరసన.. రాజ్యసభలో ఏపీ వర్షాలపై చర్చ Live Updates

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు- డే 02

Parliament : లోక్‌సభ పోడియంలో TRS నిరసన.. రాజ్యసభలో ఏపీ వర్షాలపై చర్చ Live Updates

Parliament Live Updates

Updated On : November 30, 2021 / 2:14 PM IST

Parliament winter session Day-02 Live Updates

వర్షాకాల సమావేశాల చివరి రోజున అనుచితంగా వ్యవహరించిన 12మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు సహా రైతులు, విద్యుత్ బిల్లులు, పలు హాట్ హాట్ ఇష్యూలపై పార్లమెంట్ లో రచ్చ జరుగుతోంది. లోక్ సభ నుంచి విపక్షాలు కాంగ్రెస్, డీఎంకే, నేషనల్ కాన్ఫరెన్స్ వాకౌట్ చేశాయి. రాజ్యసభలో నిరసన తెలిపిన ప్రతిపక్ష పార్టీలపై చైర్మన్ వెంకయ్య ఫైరయ్యారు. తప్పు చేసి దిద్దుకోకుండా తమకే పాఠాలు చెబుతారా అని క్లాస్ తీసుకున్నారు. గందరగోళం మధ్యే రాజ్యసభ ప్రొసీడింగ్స్ కొనసాగించే ప్రయత్నం చేశారు రాజ్యసభ చైర్మన్. ఐతే.. విపక్షాలు పట్టు వీడలేదు. వరుస వాయిదాలతో పార్లమెంట్ రెండోరోజు కూడా కార్యకలాపాలు స్తంభించిపోయిన పరిస్థితి.