సైంటిస్టు వేణుగానం విన్నారా? : ఆహా.. ఎంత మధురమో..!

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 07:06 AM IST
సైంటిస్టు వేణుగానం విన్నారా? : ఆహా.. ఎంత మధురమో..!

Updated On : December 30, 2019 / 7:06 AM IST

సైంటిస్ట్ లు అంటే ఏవేవో పరిశోధనలు చేస్తుంటారు. ఎప్పుడూ ల్యాబ్ లలోనే గడిపేస్తుంటారు. కానీ ఓ  సైంటిస్ట్  మాత్రం చక్కగా ఫ్లూట్ వాయించారు. అది కూడా పెద్ద పెద్ద అధికారులు..మేధావులు ఉన్న మీటింగ్ లో. మరి ఆ ఫ్లూట్  సైంటిస్ట్  ఎవరు? ఎక్కడ వాయించారు? ఎందుకు వాయించారో తెలుసుకుందాం..

అది ఓ ఉన్నతస్థాయి సమావేశం. ఈ సమావేశానికి ఎంపీలు, ఇస్రో చైర్మన్, అధికారులు, వీఐపీలు హాజరయ్యారు. ఇంతటి హేమాహేమీలు ఉంటే ఆ మీటింగ్ ఎంత సీరియస్‌గా ఉంటుందో తెలిసిందే. అలాగే ఆ సమావేశం కూడా కొనసాగింది. అలా జరిగిన మీటింట్ ముగింపులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బెంగళూరు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ పి. కున్హికృష్ణన్ అద్భుతమైన మురళీగానం ప్రదర్శనతో సమావేశాన్ని ముగించారు. 
 
వివరాల్లోకి వెళితే..పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇస్రో అధికారులతో భేటీ అయింది. ఈ సమావేశానికి ఎంపీ జైరాం రమేష్, ఇస్రో చైర్మన్ కె. శివన్ సహా ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమావేశం లాస్ట్ లో పి. కున్హికృష్ణన్ అద్భుతమైన ఫ్లూట్ ప్రదర్శనతో ఎంతో ఆహ్లాదాన్ని పంచారు. వావ్ ఏమీ ఈ వేణుగానం అనిపించారు.  వాతాపి గణపతిం భజే పాటను మురళీ గానం ద్వారా వినిపించారు. ఆయన ప్రదర్శనకు రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ మైమరచిపోయారు. ఎంతగానో పరవశించిపోయారు. ఆయనే కాదు సమావేశంలో ఉన్న సభ్యులందరూ కున్హికృష్ణన్ అద్భుతమైన వేణుగానానికి తమ చప్పట్లతో ప్రశంసించారు. ఈ  వీడియోను ఎంపీ  జైరాం రమేష్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ అద్భుతమైన వేణుగానాన్ని ఈ వీడియోలో మీరు వినండి..చూడండీ..ఆస్వాదించండి.