23 ఇండియన్ పాస్ పోర్టులు మిస్సింగ్!
భారతీయులకు సంబంధించిన 23 పాస్ పోర్టులు అదృశ్యమయ్యాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

భారతీయులకు సంబంధించిన 23 పాస్ పోర్టులు అదృశ్యమయ్యాయి. ఈ మేరకు బుధవారం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
-
లోక్ సభలో మంత్రి సుష్మాస్వరాజ్ వివరణ
ఢిల్లీ: భారతీయులకు సంబంధించిన 23 పాస్ పోర్టులు అదృశ్యమయ్యాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ నుంచి మిస్ అయినట్టు తమకు సమాచారం అందినట్టు పేర్కొంది. పాకిస్థాన్ కు వెళ్లేందుకు వీసాకు దరఖాస్తు చేసుకున్న భారతీయుల పాస్ పోర్టులు కనిపించడం లేదని భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ లోక్ సభలో పేర్కొన్నారు. ‘‘భారతీయుల పాస్ పోర్టులు మిస్ అయినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమాచారం అందింది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ నుంచి మొత్తం 23 వరకు పాస్ పోర్టులు అదృశ్యమైయ్యాయి’’ అని లోక్ సభలో లేవెనేత్తిన ప్రశ్నకు బదులుగా సుష్మా వివరణ ఇచ్చారు. ‘‘ పాస్ పోర్టులు దుర్వినియోగం కాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆయా పాస్ పోర్టులను పాస్ పోర్టు డేటాబేస్ లో మిస్సింగ్ స్టేటస్ లో నిక్షిప్తం చేసినట్టు ఆమె తెలిపారు.
సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు సుష్మా చెప్పారు. పాస్ పోర్టు కోల్పోయిన భారతీయులకు తిరిగి పాస్ పోర్టులను జారీ చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలిపారు. మిస్ అయిన పాస్ పోర్టుల్లో ఎక్కుమంది సిక్కు కమ్యూనిటీకి చెందినవారే ఉన్నారు. పాకిస్థాన్ హై కమిషన్ కు వీసాకు దరఖాస్తు చేసుకున్నావారంతా సిక్కు మతస్థులే కావడం గమనార్హం. పాక్ లోని గురుద్వారతో కలిపి కర్తార్ పూర్ శాహిబ్ సహా పలుప్రాంతాలను దర్శించుకునేందుకు వీరంతా వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 21 నుంచి 30 వరకు జరిగిన గురునానక్ దేవ్ జన్మదినోత్సవ వేడుకులకు హాజరయ్యేందుకు 3,800 మంది సిక్కు యాత్రికులకు పాకిస్థాన్ వీసాలు జారీ చేసింది. ఈ క్రమంలో తమ పాస్ పోర్టు మిస్ అయినట్టు గ్రహించిన బాధితులంతా పోలీసులను ఆశ్రయించారు.