పట్నాలోనే వరద సమస్య ఉందా…జర్నలిస్టులపై బీహార్ సీఎం ఆగ్రహం

పట్నాలో వరదల గురించి ప్రశ్నించిన జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు బీహార్ సీఎం నితీష్ కుమార్. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వరదలు వస్తున్నాయని,అమెరికాలో కూడా వస్తున్నాయని, పాట్నాలో మునిగిన కొన్ని ప్రాంతాలే మీకు సమస్యగా కనిపించాదా అంటూ ఆగ్రహంగా సమాధానమిచ్చారు. అమెరికాలో ఏమయిందని ప్రశ్నించారు.

మీ అవసరం మాకు లేదంటూ జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు. అయితే జర్నలిస్టులకు తన సమాధానానికి ఆయన తర్వాత గట్టి ఆందోళనలే ఎదుర్కోవాల్సి వచ్చింది. బీహార్ లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాలు,వరదల కారణంగా రాజధాని పట్నాలో రోడ్డు చెరువులని తలపిస్తున్నాయి.

పట్నా నగరం నీట మునిగింది. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ ఇంటిని కూడా వరద చుట్టుముట్టింది. బీహార్ లో వర్షాలు,వరదల కారణంగా ఇప్పటివరకు30మందికి పైగా మరణించారు. రెస్కూ ఆపరేషన్లు కొనసాగుతూ ఉన్నాయి.