అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చెప్పుతో కొట్టిన మహిళ

  • Published By: veegamteam ,Published On : May 10, 2019 / 02:08 PM IST
అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చెప్పుతో కొట్టిన మహిళ

Updated On : May 10, 2019 / 2:08 PM IST

రాజస్థాన్ లో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి చెంప చెల్లుమనిపించింది ఓ మహిళ. అతన్ని చెప్పుతో కొట్టింది. భరత్ పూర్ లో మహిళ అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లింది. మహిళను డాక్టర్ పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించాడు. 

అయితే ఎక్స్ రే ల్యాబ్ లో టెక్నిషియన్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపించిన సదరు మహిళ.. స్థానికుల సహాయంతో అతనిపై దాడి చేసింది. టెక్నిషియన్ ను చెప్పుతో కొట్టింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.