Petrol
Petrol And Diesel Price : దేశంలో చమురు ధరలు దిగనంటున్నాయి. ఇప్పట్లో ధరల మోత తగ్గేట్టట్టు కనిపించడం లేదు. రోజు రోజుకు కొద్ది కొద్దిగా ధరలు పెరుగుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటింద. తానేం తక్కువ తినలేదు..అంటూ..డీజిల్ ధర రూ. 100 దాటింది. రోజు రోజుకు ధరలు పెరుగుతుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు బేంబెలెత్తిపోతున్నారు. వీటి ధరల ఎఫెక్ట్ ఇతర వాటిపై పడుతున్నాయి.
Read More : High Court : నేడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం
తాజాగా..మరోసారి పెట్రో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా…దేశీయ పెట్రోలియం కంపెనీలు మాత్రం…వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ వస్తున్నాయి. లీటరు పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెంచడంతో రికార్డు స్థాయికి చేరినట్లైంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 104.44, డీజిల్ రూ. 93.17 కి చేరుకుంది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 108.64,డీజిల్ రూ. 101.65గా ఉంది.
Read More : MAA Elections: ‘మా’ ఎన్నికలు.. విజేతల పూర్తి వివరాలు..!
ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ లీటర్ పెట్రోల్ రూ. 104.44. లీటర్ డీజిల్ రూ. 93.17
కోల్ కతా లీటర్ పెట్రోల్ రూ. 105.09. లీటర్ డీజిల్ రూ.96.28
ముంబాయి లీటర్ పెట్రోల్ రూ. 110.41. లీటర్ డీజిల్ రూ. 101.03
చెన్నై లీటర్ పెట్రోల్ రూ. 101.89 లీటర్ డీజిల్ రూ. 97.69
Read More : Huzurabad by poll: హుజూరాబాద్ బై పోల్ అభ్యర్థుల్లో బలహీనతలేంటి..?
గుర్ గావ్ లీటర్ పెట్రోల్ రూ. 101.76 లీటర్ డీజిల్ రూ. 93.58
నోయిడా లీటర్ పెట్రోల్ రూ. 101.50 లీటర్ డీజిల్ రూ. 93.62
బెంగళూరు లీటర్ పెట్రోల్ రూ. 108.08 లీటర్ డీజిల్ రూ. 98.89
భువనేశ్వర్ లీటర్ పెట్రోల్ రూ. 105.80 లీటర్ డీజిల్ రూ. 102.04
Read More : UNICEF : అఫ్ఘాన్‌లో పరిస్థితి దారుణం.. ప్రమాదంలో 10 లక్షల మంది చిన్నారులు
చండీఘడ్ లీటర్ పెట్రోల్ రూ. 100.53 లీటర్ డీజిల్ రూ. 92.90
హైదరాబాద్ లీటర్ పెట్రోల్ రూ. 108.64 లీటర్ డీజిల్ రూ. 101.66
జైపూర్ లీటర్ పెట్రోల్ రూ. 111.54 లీటర్ డీజిల్ రూ. 102.69