MAA Elections: ‘మా’ ఎన్నికలు.. విజేతల పూర్తి వివరాలు..!

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల హడావుడి ముగిసింది. పోటా పోటీ ప్రచారం చేసిన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్లలో.. అంతిమ విజయం మంచు విష్ణుదే అయ్యింది.

MAA Elections: ‘మా’ ఎన్నికలు.. విజేతల పూర్తి వివరాలు..!

Comments

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల హడావుడి ముగిసింది. పోటా పోటీ ప్రచారం చేసిన మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెళ్లలో.. అంతిమ విజయం మంచు విష్ణుదే అయ్యింది. మా.. తర్వాత అధ్యక్షుడిగా విష్ణు బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రెసిడెంట్ పదవితో పాటుగా.. ఏ ప్యానెల్ లో ఎవరు గెలిచారు.. అన్న వివరాలివి.

మంచు విష్ణు ప్యానెల్ నుంచి ప్రెసిడెంట్ బరిలో నిలిచిన విష్ణు.. జనరల్ సెక్రటరీగా రఘుబాబు, వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి.. జాయింట్ సెక్రటరీగా గౌతంరాజు, ట్రెజరర్ గా శివబాలాజీ.. కార్యవర్గ సభ్యులుగా మాణిక్, హరనాథ్, బొప్పన శివ, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత విజయాన్ని అందుకున్నారు.

ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి బరిలో ఉన్న వారిలో.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్.. వైస్ ప్రెసిడెంట్ గా బెనర్జీ.. జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్.. కార్యవర్గ సభ్యులుగా అనసూయ, సురేష్ కొండేటి, కౌశిక్, శివారెడ్డి, ఖయ్యూం గెలుపొందారు.

మొదటి నుంచి ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఎన్నికల హడావుడి.. చివరికి ముగిసింది. ఫలితాల వెల్లడి సందర్భంగా.. ఎమోషనల్ గా ఫీలైన విజేత విష్ణు.. కంట తడి పెట్టారు. విష్ణును ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. మా.. అధ్యక్షుడిగా విజయం సాధించిన విష్ణుకు.. సినీ ప్రముఖులు అందరూ అభినందనలు తెలుపుతున్నారు.