Petrol Rate Today : 31 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు
దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 31 రోజులుగా ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు జరగలేదు.

Petrol Rate Today (2)
Petrol Rate Today : దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 31 రోజులుగా ఇంధన ధరల్లో ఎటువంటి మార్పు జరగలేదు. రేట్లు పెరగకపోయినా ఇప్పటి వరకు పెరిగిన ధరలతో వాహనదారులకు భారంగా మారింది. లీటర్ పెట్రోల్ ధర సెంచరీదాటిపోవడంతో వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు జనాలు. డీజిల్ ధరలు కూడా వందకు చేరువలో ఉడటంతో ప్రజలు తన వాహనాలను గతంలోలా బయటకు తీయడం లేదు. ఇక పెట్రోల్ డీజిల్ పై సుంకాలు తగ్గించేంది లేదని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ఒక వేల, రాష్ట్ర ప్రభుత్వం కానీ, లేదంటే పెట్రోలియం సంస్థలు కానీ సుంకం తగ్గిస్తే పెట్రోల్ రేట్లు తగ్గే అవకాశం ఉంది.
ఇక దేశంలోని వివిధ నగరాల్లోని పెట్రోల్, డీజిల్ ధరలను ఒకసారి పరిశీలిస్తే..
ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87గా ఉంది.
ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది.
కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా, డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది.
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా, డీజిల్ ధర రూ.94.39గా ఉంది.
బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 ఉండగా, డీజిల్ ధర రూ.95.26 గా ఉంది.
లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.90.15గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ. 97.10గా ఉంది.
కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71 గా ఉండగా లీటర్ డీజిల్ 98.13గా ఉంది.
వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.97.53గా ఉంది.
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108.03 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.99.62గా ఉంది.
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.04 ఉండగా,. డీజిల్ ధర రూ. 98.65గా ఉంది.
విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.16లకు లభిస్తుండగా, డీజిల్ ధర రూ.98.76గా ఉంది.