Nirmala Sitharaman: పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు మేము సిద్ధం: నిర్మలా సీతారామన్

దేశంలో పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తాము సిద్ధమని, అయితే, ఇది రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ)తో సమావేశమైన నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలియం, గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని అన్నారు.

Nirmala Sitharaman: దేశంలో పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తాము సిద్ధమని, అయితే, ఇది రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ)తో సమావేశమైన నిర్మలా సీతారామన్ ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలియం, గ్యాస్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తామని అన్నారు.

అలాగే, ఈ విషయంలో జీఎస్టీ మండలిలో చర్చకు ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. భారత ఆర్థిక వృద్ధి ఇలాగే కొనసాగాలని, ఏ మాత్రం తగ్గకూడదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర బడ్జెట్ రూపొందించామని చెప్పారు. మూల ధన వ్యయానికి వరుసగా గత మూడు-నాలుగేళ్లుగా ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానమైన వాటిపై దృష్టి పెట్టామని అన్నారు.

విద్యుత్తు సహా పలు రంగాల్లో సంస్కరణలు తీసుకురావాలని, వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకాన్ని అమలు చేయాలని తాము రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నామని నిర్మలా సీతారామన్ చెప్పారు. కాగా, దేశంలో పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బీజేపీ నేతలు చాలా కాలంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాచేస్తే వాటి ధరలు తగ్గుతాయని కూడా అంటున్నారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. గౌతమ్ మల్హోత్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

ట్రెండింగ్ వార్తలు