Phone Tapping Row : ఫోన్ ట్యాపింగ్ వివాదం..లోక్ సభలో ఐటీ మంత్రి కీలక వ్యాఖ్యలు

భారత్ లోని కేంద్ర మంత్రులు,జడ్జిలు,జర్నలిస్టులు సహా మరికొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ వచ్చిన వార్తా కథనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

Phone Tapping Row భారత్ లోని కేంద్ర మంత్రులు,జడ్జిలు,జర్నలిస్టులు సహా మరికొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ వచ్చిన వార్తా కథనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఫోన్ ట్యాపింగ్ వివాదంలో ప్రభుత్వం పాత్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఖండించారు. గతంలో కూడా వాట్సాప్‌లో పెగసాస్ వాడకం గురించి ఇలాంటి వాదనలు వచ్చాయని ఆయన అన్నారు. ఈ ఆరోపణలు రావడాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని, సంస్థలను అప్రతిష్ఠపాల్జేసేందుకు జరుగుతున్న ప్రయత్నంగా ఐటీ మంత్రి అభివర్ణించారు. ప్రస్తుతం దేశంలో ప్రతి అంశానికి సంబంధించి కచ్చితమైన నియమనిబంధనలు ఉన్నాయని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు.

సోమవారం లోక్ సభలో విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ..అత్యంత సంచలనాత్మక కథను గత రాత్రి ఓ వెబ్ పోర్టల్ ప్రచురించింది. ఈ కథ చుట్టూ చాలా ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ఒక రోజు ముందు పత్రికా నివేదికలు వచ్చాయి. ఇది యాదృచ్చికం కాదు అని మంత్రి అన్నారు. కాగా,విపక్ష సభ్యుల ఆందోళనతో నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.

మరోవైపు,భారత్​లోని కేంద్ర మంత్రులు, జడ్జిలు,జర్నలిస్టులు, ప్రముఖుల ఫోన్లను పెగాసస్ అనే స్పైవేర్ సాయంతో హ్యాక్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆ సాఫ్ట్​వేర్​ ను విక్రయించే ఇజ్రాయెల్ కి చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ సోమవారం ఖండించింది. వార్తా సంస్థలు ప్రచురించిన ఆ కథనాలకు సరైన ఆధారాలు లేవని,అవన్నీ వాస్తవదూరంగా ఉన్నాయని తెలిపింది. ఈ కథనాలను అంతర్జాతీయ కుట్రగా ఓ ఇంటర్వ్యూలో అభివర్ణించిన ఎన్ఎస్ఓ గ్రూప్..దీనిపై పరువు నష్టం దావా వేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపింది.

READPegasus Project : కలవరపెడుతున్న పెగాసస్ స్పైవేర్, ప్రముఖుల ఫోన్లు హ్యాక్ ?

ట్రెండింగ్ వార్తలు