Temjen Imna: అందమైన అమ్మాయిలతో నాగాలాండ్ మంత్రి గ్రూప్ ఫోటో.. ఆయన చూపులు మాత్రం..

రాజకీయ నేతలకు ఒక్క క్షణం తీరిక దొరికితే ఏం చేస్తారు? అనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది. నాగాలాండ్ బీజేపీ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా ఒక్క క్షణం టైం దొరికితే ఏం చేస్తారంటే? తనకి ఇష్టమైన ఫుడ్ దొరికితే చుట్టుపక్కల ఎవరున్నా పట్టించుకోరు.

Nagaland minister Temjen photo viral : ప్రజా ప్రతినిధులు అయితే మాత్రం వాళ్లలోనూ హ్యూమర్ ఉంటుంది కదా.. అప్పుడప్పుడు దాన్ని బయటపెడుతుంటారు. వాళ్లకు దొరికే ఒక్క క్షణంలో సంతోషాన్ని వెతుక్కుంటారు. నాగాలాండ్ (nagaland) బీజేపీ మంత్రి (bjp minister) టెమ్‌జెన్ ఇమ్నా(Temjen Imna) సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. చమత్కారవంతమైన పోస్టులు పెడుతుంటారు. రీసెంట్ గా అందమైన అమ్మాయిలతో ఫోటో దిగారు. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది? అంటే..

Karnataka : రాముడి విగ్రహం ఎక్కి ఫొటోకి పోజులిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే .. ఇదేనా రాముడిపై ఉన్న భక్తి, గౌరవం అంటూ విమర్శలు

రీసెంట్ గా మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా ఎయిర్‌పోర్ట్‌లోని (airport) ఫుడ్ కోర్ట్‌కి (food court) వెళ్లారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన అందమైన అమ్మాయిలు కొందరు మంత్రితో ఫోటో దిగడానికి ఆసక్తి చూపారు. ఓవైపు ఆయన అప్పుడే పరాఠా (paratha) తినడానికి సిద్ధమవుతున్నారు. పక్కనే పొగలు కక్కుతూ టీ కూడా సిద్ధంగా ఉంది. మంత్రులకు పబ్లిక్ లో తినడానికి దొరికే టైం చాలా తక్కువ. ఆ సమయంలో తనకి ఎంతో ఇష్టమైన ఫుడ్ ఎదురుగా కనిపిస్తే ఏం చేస్తారు పాపం.. ఫోటో పోజ్ కి ఓకే చెప్పినా ఆయన చూపులన్నీ ఫుడ్ మీదనే ఉన్నాయి. ఇంతలో కెమెరాని క్లిక్ మనిపించారు.

Namo App New Feature : మోడీతో దిగిన ఫోటో మిస్ అయ్యిందా? నమో యాప్‌లో దొరికేస్తుంది

ఫోటో చూస్తుంటే ఆయనకేమైనా తిండి పిచ్చా? ఫోటో అయ్యేదాకా అయినా ఆగలేరా? అనిపిస్తుంది. అయితే ఆయన తాను ఫుడ్ తినే సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నానని వివరణ ఇచ్చుకున్నాడు. అదే విషయాన్ని తన ట్విట్టర్ (twitter) ఖాతాలో పోస్ట్ చేశాడు. తన చుట్టూ ఉన్న అమ్మాయిలు ఫోటో కోసం రిక్వెస్ట్ చేస్తే వారిని తాను అవాయిడ్ చేయలేదని.. తనకి దొరికిన ఒక్క క్షణంలో తనకెంతో ఇష్టమైన ఫుడ్ తినడంలో సంతోషంగా ఉన్నానని చెబుతూ పోస్ట్ పెట్టారు ఆ మంత్రి. ఈ పోస్ట్ మీద జనాలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వెనుక అంత అందమైన అమ్మాయిలు నిలబడి ఉంటే మీరు ఫుడ్ కి ఎలా ప్రాముఖ్యత ఇస్తారు? అని కొందరు.. అందుకే ఫుడ్ తినే సమయంలో ఎవర్నీ డిస్ట్రబ్ చేయకూడదు అని కొందరు.. రిప్లై చేసారు.

ట్రెండింగ్ వార్తలు