Karnataka : రాముడి విగ్రహం ఎక్కి ఫొటోకి పోజులిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే .. ఇదేనా రాముడిపై ఉన్న భక్తి, గౌరవం అంటూ విమర్శలు

రాముడి విగ్రహంపైకి ఎక్కి ఫొటోకి పోజులిచ్చిన బీజేపీ ఎమ్మెల్యేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామనామ జపం చేసే బీజేపీకి ఇదేనా రాముడిపై ఉన్న భక్తి, గౌరవం అంటూ విమర్శిస్తున్నారు.

Karnataka : రాముడి విగ్రహం ఎక్కి ఫొటోకి పోజులిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే .. ఇదేనా రాముడిపై ఉన్న భక్తి, గౌరవం అంటూ విమర్శలు

Karnataka BJP MLA Under Anger For Climbing Lord Ram Statue

Updated On : April 1, 2023 / 10:58 AM IST

Karnataka : బీజేపీ రాముడు రాముడు అంటూ రాముడి గొప్పతనం గురించి పదే పదే చెబుతుంటుంది. వివాదాస్పద అయోధ రామమందిరం నిర్మాణం కూడా బీజేపీ ప్రభుత్వ హయాంలోనే నిర్మితమవుతోంది. ఇలా రాముడి బీజేపీకి మాత్రమే దేవుడు అన్నట్లుగా ఆపార్టీ నేతల వ్యాఖ్యలు ఉంటుంటాయని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అటువంటి బీజేపీ నేతలు శ్రీరామ నవమి సందర్భంగా రాముడి విగ్రహంపైకి ఎక్కి ఫోటోలకు ఫోజులిచ్చిన ఘటన పెను దుమారం రేపుతోంది. ఇదేనా బీజేపీకి రాముడిపై ఉన్న గౌరవం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. విమర్శలతో విరుచుకుపడుతున్నారు ప్రతిపక్ష నేతలు, భక్తులు..

ఈ వివాదానాకి కారణం కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే శరణు సలాగర్ చేసిన ఘనకార్యమే కారణం..గురువారం (మార్చి 30,2023) శ్రీరామనవమి పండుగ సందర్భంగా బీదర్ జిల్లాలోని బసవకల్యాణ్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే శరణు సాలగర్ శ్రీరాముడి రాముడి విగ్రహానికి పూల దండ వేసేందుకు రాముడి విగ్రహంపైకి ఎక్కారు. విగ్రహంపై పెద్దగా ఉంటే పక్కన నిచ్చెనలాంటిది ఏర్పాటు చేసుకుని దండ వేయవచ్చు. కానీ ఎమ్మెల్యే శరణు మాత్రం విగ్రహంపైకి ఎక్కారు. దండ వేశారు. అక్కడితో ఊరుకోకుండా అక్కడే నిలబడి అభివాదం చేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు.

Puttaparthi Politics : పుట్టపర్తిలో రాజుకున్న రాజకీయం.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి సవాళ్లు.. ప్రతి సవాళ్లు

దీనికి సంబంధించి ఫోటోలు, వీడియోలోసి సోషల్ మీడియాలో వైరల్ కావటంతో విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఇదేనా బీజేపీకి రాముడిపై ఉండే గౌరవం అంటూ ప్రశ్నిస్తు,,బీజేపీ నాయకులు దేవుళ్లను అవమానిస్తున్నారు అంటూ విమర్శలు సంధిస్తున్నారు. కాగా త్వరలోనే కర్ణాటకలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో ఇటువంటి వివాదం బీజేపీకి తలనొప్పిగా తయారైంది.