Puttaparthi Politics : పుట్టపర్తిలో రాజుకున్న రాజకీయం.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి సవాళ్లు.. ప్రతి సవాళ్లు

పుట్టపర్తి అబివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ వైసీపీ, టీడీపీ సవాల్ కు ప్రతి సవాల్ విసురుకున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు సత్యమ్మ ఆలయం వద్ద చర్చకు ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు.

Puttaparthi Politics : పుట్టపర్తిలో రాజుకున్న రాజకీయం.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి సవాళ్లు.. ప్రతి సవాళ్లు

Puttaparthi Politics

Puttaparthi Politics : శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాజకీయం రాజుకుంది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుతున్నారు. పుట్టపర్తి నియోజక అభివృద్ధిపై చర్చకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి సిద్ధమయ్యారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని మాజీ మంత్రి పల్లె అంటున్నారు. మరోవైపు  పుట్టపర్తి అభివృద్ధి పేటెంట్ హక్కులు తమవేనని ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి అంటున్నారు.

పుట్టపర్తి అబివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ వైసీపీ, టీడీపీ సవాల్ కు ప్రతి సవాల్ విసురుకున్నాయి. శనివారం ఉదయం 10 గంటలకు సత్యమ్మ ఆలయం వద్ద చర్చకు ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. చర్చలు, నిరసనలకు ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు అంటున్నారు. పుట్టపర్తిలో ఏప్రిల్ 30 తేది వరకు 30 యాక్ట్ అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు.

Nara Lokesh: ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అవినీతిలో తోపు: నారా లోకేశ్

ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉదయమే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అవినీతిని నిరూపించటానికి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా చర్చకు వచ్చి తీరుతామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అంటున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి…శనివారం ఉదయం 10 గంటలకు సత్యమ్మ ఆలయం వద్ద ప్రమాణానికి తాను సిద్ధమేనని పల్లె రఘునాథ్ రెడ్డి సవాల్ చేశారు.

‘నీ అవినీతిని నిరూపిస్తా.. నేను చేసిన అభివృద్ధిని వివరిస్తా.. నీ ఆట కట్టిస్తా’ అని అన్నారు. నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా ఈ నాలుగేళ్ల కాలంలో నువ్వు చేసిన అవినీతి గురించి మాట్లాడారు తప్ప వ్యక్తిగతంగా దూషించలేదని చెప్పారు. నువ్వు నన్ను, నారా లోకేష్ ను వ్యక్తిగతంగా దూషిస్తావా అంటూ ఫైర్ అయ్యారు. మంచి చెబితే నేర్చుకుంటా విమర్శిస్తే ఓర్చుకుంటా నారా లోకేష్ బాబును ఏమైనా అంటే తేల్చుకుంటా అని అన్నారు.