హృదయాలను కలిచివేస్తున్న ఫొటో

  • Published By: venkaiahnaidu ,Published On : February 9, 2020 / 12:01 AM IST
హృదయాలను కలిచివేస్తున్న ఫొటో

Updated On : February 9, 2020 / 12:01 AM IST

ప్లాస్టిక్ పొల్యూషన్ సమస్యను మరియు వన్యప్రాణుల సంఖ్యను హైలైట్ చేసే మరొక ఫొటో ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ లో క్లిక్ చేసిన ఓ ఫొటోను ఇండియన్ ఫారెస్ట్ సన్వీసెస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ శుక్రవారం(ఫిబ్రవరి-7,2020)ట్విట్టర్ లో షేర్ చేశారు.

అడవుల్లో,మహాసముద్రాల్లో చాలా లోతుగా ప్లాస్టిక్ భూతం పెరిగిపోతుందని,ప్లాస్టిక్ భూతం కారణంగా వందలాది వన్యప్రాణులు చనిపోతున్నాయి. కొన్ని పులలు మన నుంచి గిఫ్ట్ గా పొందిన ప్లాస్టిక్ తో ఆడుకుంటున్నాయంటూ ప్రవీన్ కశ్వాన్ ఓ ఫొటోనే షేర్ చేశారు. మూడు పులులు ప్లాస్టిక్ ముక్కతో ఆడుకుంటున్నట్లు ఆ ఫొటోలో కన్పిస్తోంది. 

ఆ ఫొటోలో… జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా ప్రవహించే రామ్‌గంగా నది వద్ద ఒక ఆడ పులి,దాని రెండు పిల్లలు నిలబడి ఉన్నాయి. పిల్ల పులి ఒకటి నోటిలో ప్లాస్టిక్ డ్రమ్ పట్టుకొని కనిపిస్తుంది. కొంతమంది టూరిస్టులు గత నెల చివరి వారంలో ధిక్లా రేంజ్ లో తీసిన ఈ ఫొటో ఇప్పుడు అధికారులు మరియు పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్లాస్టిక్ కారణంగా ఊర్లలోని ప్రజలకే కాదు అడవుల్లోని జంతువులకు కూడా ప్రమాదమే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏటా వందలాది మూగజీవులు మనిషి గిఫ్ట్ గా ఇచ్చిన ప్లాస్టిక్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై జిమ్ కార్బెట్ డైరెక్టర్ రాహుల్ మాట్లాడుతూ… ఈ ఫొటోను కొంతమంది పర్యాటకులు తమకు ఇచ్చారని,ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కార్బెట్ టైగర్ రిజర్వ్(CTR) ప్లాస్టిక్ రహిత జోన్. పర్యాటకులు కూడా ఇక్కడ ప్లాస్టిక్ ఉత్పత్తులను తీసుకెళ్లడానికి అనుమతించరు. అందువల్ల, పులులు నోటితో పట్టుకున్న ప్లాస్టిక్ డ్రమ్ నదిలోకి ఎలా వచ్చిందనే దానిపై కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము అని ఆయన అన్నారు. నది చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాలలో ఒక గ్రామ నివాసితులు ఈ ప్లాస్టిక్ డ్రమ్ ను నదిలో పడేసే అవకాశం ఉంది.

వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రకారం…మన సముద్రాల్లో ప్రతి సంవత్సరం 80లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను డంప్ చేస్తున్నారు. ఇది సముద్ర, వన్యప్రాణుల జనాభాను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కడుపులో 104 ముక్కల ప్లాస్టిక్‌తో ఒక బిడ్డ తాబేలు మరణించిన హృదయ విదారక ఫొటో ఒకటి గతేడాది వైరల్ అయిన విషయం తెలిసిందే.