RBI డబ్బు దొంగిలిస్తే సరిపోదు: రాహుల్ గాంధీ

RBI డబ్బు దొంగిలిస్తే సరిపోదు: రాహుల్ గాంధీ

Updated On : August 27, 2019 / 8:51 AM IST

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ప్రభుత్వం విమర్శలు గుప్పించారు. ఎన్నడూలేనంతగా రికార్డు స్థాయిలో ఆర్బీఐ నుంచి ట్రాన్సఫర్ అవడం పట్ల కామెంట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక శాఖ మంత్రి సాక్ష్యాలు లేకుండా, సొంత ఆర్థిక సంక్షోభం సృష్టించారని, ఆర్బీఐ నుంచి డబ్బులు దొంగిలించారంటూ కామెంట్ చేశారు. 

దాంతో తుపాకీ దెబ్బకు గాయపడి బ్యాండ్ ఎయిడ్ దొంగిలిస్తే లాభం లేదని వెటకారం చేశారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ ప్రధాని, ఆర్థిక మంత్రిపై వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. ‘ఆర్బీఐ దగ్గర్నుంచి లూటీ చేస్తే సరిపోదు. తుపాకీ దెబ్బకు బ్యాండ్ ఎయిడ్ తెచ్చుకున్నట్లే అవుతుంద’ని ఆరోపించారు. 

కాంగ్రెస్ చీఫ్ స్పోక్స్ పర్సన్ రణదీప్ సుర్జీవాలా కూడా ట్వీట్‌ ద్వారా స్పందిస్తూ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారా అని ప్రశ్నించారు. బడ్జెట్ లెక్కల్లో తప్పుగా బనాయించి ఆర్బీఐ దగ్గర్నుంచి డబ్బు తెచ్చుకున్నారా అని అడిగారు. ఇక ఈ 1.76లక్షల కోట్లు బడ్జెట్‌లో మిస్టరీగానే ఉండిపోతాయని వాటిని ఏం చేశారో అనేది తెలియకుండానే ఉండిపోతుందని పేర్కొన్నారు.