పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి కీలక శాఖలు

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా అమిత్ షా..

పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌ నాయుడు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి కీలక శాఖలు

కేంద్ర క్యాబినెట్లో ఎవరెవరికీ ఏయే శాఖలు కేటాయించారన్న వివరాలు తెలిశాయి. పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. బీజేపీ తెలంగాణ ఎంపీ కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పదవి దక్కింది. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా శ్రీనివాసవర్మకు అవకాశం దక్కింది.

ఈ కీలక శాఖల్లో మళ్లీ వీరే..

  • హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి: అమిత్ షా
  • రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి: రాజ్‌నాథ్ సింగ్
  • విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి: ఎస్ జైశంకర్
  • ఆర్థిక మంత్రిత్వ శాఖ మంత్రి: నిర్మలా సీతారామన్
  • రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి: నితిన్ గడ్కరీ

ఇతర శాఖల్లో..

జేపీ నడ్డా
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ
రసాయనాలు, ఎరువుల మంత్రి

శివరాజ్ సింగ్ చౌహాన్
వ్యవసాయం రైతుల సంక్షేమ మంత్రి
గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి

మనోహర్ లాల్
హౌసింగ్, పట్టణ వ్యవహారాల మంత్రి
విద్యుత్ శాఖ మంత్రి


కుమారస్వామి

భారీ పరిశ్రమల మంత్రి
ఉక్కు మంత్రి


పీయూష్ గోయల్

వాణిజ్యం, పరిశ్రమల మంత్రి

ధర్మేంద్ర ప్రధాన్

విద్యాశాఖ మంత్రి

జితన్ రామ్ మాంఝీ

సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి

లాలన్ సింగ్

పంచాయతీ రాజ్ మంత్రి,

మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి

పూర్తి వివరాలు

 పూర్తి వివరాల పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Also Read: కేశినేని నాని సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై