PM Modi On Omicron Fear : 300 దాటిన ఒమిక్రాన్ కేసులు.. ప్రధాని మోదీ కీలక సూచనలు

కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా స్థాయి మొదలు రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థలు పటిష్టంగా ఉంచుకోవాలని మోదీ సూచించారు. కోవిడ్ పరిస్థితులపై..

Pm Modi On Omicron Fear

PM Modi On Omicron Fear : దేశవ్యాప్తంగా కరోనా, ఒమిక్రాన్, ఆరోగ్య వ్యవస్థల సంసిద్ధత స్థితులపై ప్రధాని మోదీ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో అధికారులకు ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. కోవిడ్ పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లా స్థాయి మొదలు రాష్ట్రాల్లో ఆరోగ్య వ్యవస్థలు పటిష్టంగా ఉంచుకోవాలని మోదీ సూచించారు. కాంటాక్ట్ ట్రేసింగ్, కరోనా టెస్టులతో పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని ప్రధాని ఆదేశించారు. ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించాలన్నారు.

వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న, కోవిడ్ కేసులు పెరుగుతున్న, ఆరోగ్య మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రాలకు కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు పంపాలన్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. రాష్ట్రాలు ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అందరం కలిసి సమష్టిగా కరోనాను ఎదుర్కొందామని ప్రధాని పిలుపునిచ్చారు.

ఒమిక్రాన్ భయాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో దేశంలో ఒమిక్రాన్‌, కొవిడ్‌తో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. కేంద్ర హోంశాఖ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, పలువురు నిపుణులు హాజరైన ఈ సమావేశంలో ఒమిక్రాన్‌తో పాటు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పైనా ప్రధాని చర్చించారు.

Bharat Bandh : డిసెంబర్ 31 వరకు భారత్ బంద్..? నిజమెంత

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలంది. ఒమిక్రాన్ ముప్పు ముంచుకు రాకముందే ఆంక్షల్ని అమల్లోకి తీసుకురావాలని, కనీసం 14 రోజులు ఆంక్షలు అమల్లో ఉండేలా చూడాలని వివరించింది.

రానున్న పండుగల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, పండుగల వేళ ఒమిక్రాన్ కట్టడికి రాత్రి కర్ఫ్యూలు అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది. భారీ సభలు, సమూహాలు నియంత్రించాలని స్పష్టం చేసింది. బాధితుల శాంపిల్స్ ను ఆలస్యం చేయకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని సూచించింది. డెల్టా, ఒమిక్రాన్ కేసులపై తరచుగా పరిశీలన జరపాలని, పాజిటివిటీ, డబ్లింగ్ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టి సారించాలంది. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు(డిసెంబర్ 23) నుంచి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు.

January 1 Alert : జనవరి 1 నుంచి RBI కొత్త రూల్స్‌.. ఆన్‌లైన్ పేమెంట్లపై ఈ నిబంధనలు తప్పనిసరి..

దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళలో నమోదైన కేసులతో 300 మార్కుని దాటేశాయి. ఈ ఒక్కరోజే (డిసెంబర్ 23,2021) తమిళనాడులో అత్యధికంగా 33 ఒమిక్రాన్‌ కేసులు రాగా.. మహారాష్ట్రలో 23 వచ్చాయి. కాగా, ఈ మహమ్మారి బారిన పడిన వారిలో 104 మంది వరకు కోలుకున్నట్టు కేంద్రం తెలిపింది.