Rahul Gandhi Pm Modi Does Not Care About People, Covid Patients Rahul Gandhi
Rahul Gandhi : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేరుతో మోదీ సర్కారు విధానాలపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయుష్మాన్ పథకాన్ని మోదీ ప్రభుత్వం బాగా హైప్ చేసిందన్నారు. అయితే ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఉచితంగా అందాల్సిన వైద్యం అందలేదన్నారు. ఈ పథకం కింద కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించలేదని రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. కరోనా పరిస్థితుల్లో వైరస్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను, దేశ ప్రజలను మోదీ సర్కార్ పట్టించుకోలేదన్నారు.
గత రెండేళ్లుగా ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిందన్నారు. ఈ క్రమంలో ఆయుష్మాన్ భారత్ పథకం కింద బాధితులకు ఉచితంగా వైద్యం అందలేదని రాహుల్ విమర్శించారు. కరోనా రోగులను, కోవిడ్ వర్కర్లను, దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం కమానేసిందని రాహుల్ ఆరోపించారు. కరోనా సమయంలో బాధితులకు ఉచిత వైద్యం అందకపోవడంతో పాటు పేదలకు కనీస ఆదాయం రాలేదని రాహుల్ ప్రస్తావించారు. చిన్న, సూక్ష్మ పరిశ్రమలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాహుల్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
COVID पीड़ितों का इलाज मुफ़्त में करवाया?
– नहींग़रीबों और श्रमिकों को न्यूनतम आय मिली?
– नहींछोटे उद्योगों को डूबने से बचाया?
– नहींThe PM does not CARE! pic.twitter.com/68J08eQKyk
— Rahul Gandhi (@RahulGandhi) March 24, 2022
కోవిడ్ బాధితులకు ఉచితంగా చికిత్స అందించలేదని రాహుల్ విమర్శించారు. పేదలు, కార్మికులకు కనీస ఆదాయం లభించిందా? అంటే లేదన్నారు. చిన్న పరిశ్రమలు నష్టపోకుండా ఆదుకున్నారా అంటే అది లేదని విమర్శించారు. దేశ ప్రజలు, కోవిడ్ బాధితుల ఇబ్బందులను ప్రధాని పట్టించుకోరని రాహుల్ మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్ గాంధీ హిందీలో చేసిన ట్వీట్‌లో మోదీ సర్కార్‌పై ఆరోపించారు.
మహమ్మారి కారణంగా ఉద్యోగాలు, ఆదాయాన్ని కోల్పోయిన భారతీయుల ఆత్మహత్యలకు పాల్పడినట్టు ఘటనలు అనేకం ఉన్నాయని రాహుల్ గుర్తు చేశారు. హైప్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకమైన ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆస్పత్రిలో చేరిన కరోనా బాధితులకు బిల్లులను చెల్లించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఆసుపత్రిలో చేరిన కోవిడ్ రోగులలో 12 శాతం కంటే తక్కువ మంది చికిత్స పొందారని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Read Also : Rahul Gandhi: ధరలను పెంచి బీజేపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుంది: రాహుల్ గాంధీ