Rahul Gandhi: ధరలను పెంచి బీజేపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుంది: రాహుల్ గాంధీ

యుక్రెయిన్ యుద్ధం కంటే ముందు నుంచే భారత్ లో ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు

Rahul Gandhi: ధరలను పెంచి బీజేపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుంది: రాహుల్ గాంధీ

Raga

Rahul Gandhi: యుక్రెయిన్ యుద్ధం కంటే ముందు నుంచే భారత్ లో ధరలు పెంచి బీజేపీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమి అనంతరం మొదటిసారిగా శనివారం నాడు ట్విట్టర్ ద్వారా స్పందించిన రాహుల్ గాంధీ..అధికార బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. “ద్రవ్యోల్బణం కారణంగా భారతీయులందరిపై పన్ను భారం పడుతుంది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం కాకముందే దేశంలో రికార్డు స్థాయిలో ధరల పెరగడం.. పేద మరియు మధ్యతరగతి ప్రజలపై మరింత భారం పడింది. ఇది మరింత పెరుగుతుంది: – ముడిచమురు > బ్యారెల్ కు 100 డాలర్లు – ఆహార ధరలు 22% పెరుగుతాయని భావిస్తున్నారు – కోవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా రవాణాకు అంతరాయం కలిగిస్తుంది – భారత ప్రభుత్వం(Govt.of India) ఇప్పుడు చర్య తీసుకోవాలి. ప్రజలను రక్షించండి. (సిక్)” అని రాహుల్ గాంధీ శనివారం ట్వీట్ చేశారు.

Also read: Pawan Kalyan: పవర్ స్టార్ మరో సినిమా.. రావణాసుర దర్శకుడితో చర్చలు!

పిఎఫ్ వడ్డీ రేట్లపైనా కోత విధించడంపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. ఈ విషయంపై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ఫేస్ బుక్ వేదికగా పరస్పర ఆరోపణలు కూడా చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా, ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకుంది. ఫలితాలను విశ్లేషించుకునేందుకు సిడబ్ల్యుసి గత ఆదివారం ఐదు గంటల పాటు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం సందర్భంగా సోనియా గాంధీ అధ్యక్షురాలిగా కొనసాగుతారని ఊహించినట్లుగానే తీర్మానించారు. జీ-23 నేతలు ఈ వారంలో రెండుసార్లు సమావేశమయ్యారు. జి-23 నేతల్లో ఒకరైన గులాం నబీ ఆజాద్ శుక్రవారం సాయంత్రం కూడా సోనియా గాంధీని కలిశారు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

Also read: Punjab New AAP Cabinet : కొలువుదీరిన పంజాబ్‌ కొత్త మంత్రివర్గం.. 10 మంది మంత్రుల ప్రమాణస్వీకారం