TRS And PK Team : సీఎం కేసీఆర్‌‌తో పని చేయడం లేదన్న ప్రశాంత్ కిశోర్

గత కొద్దిరోజులుగా.. వ్యూహకర్తల రాకతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీలన్నీ బిజీ అయ్యాయి. మరోసారి తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్

TRS And PK Team : సీఎం కేసీఆర్‌‌తో పని చేయడం లేదన్న ప్రశాంత్ కిశోర్

Kcr

KCR And Prashant Kishor : తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పనిచేస్తున్నారన్న ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌. తాను కేసీఆర్‌తో పనిచేయడం లేదన్నారు ప్రశాంత్‌ కిశోర్‌. తాను చాలా మందిని కలిసి వారి అభిప్రాయాలు మాత్రమే తీసుకుంటున్నానన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కావాలంటే 10 నుంచి 20 ఏళ్లు పడుతుందని చెప్పారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కావడానికి అడ్డదారి లేదన్నారు. రెండేళ్లో, రెండు నెలలో పనిచేస్తే బీజేపీకి ప్రత్యామ్నాయం కాలేరన్నారు ప్రశాంత్‌ కిశోర్‌.

Read More : Telangana CM : మంత్రులతో సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్.. ఎందుకు ?

గత కొద్దిరోజులుగా.. వ్యూహకర్తల రాకతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీలన్నీ బిజీ అయ్యాయి. మరోసారి తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్‌.. ఎట్టి పరిస్థితిల్లోనూ అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకోసమే పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌లను రెండు పార్టీలు నియమించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ కోసం పీకే టీమ్‌ పనిచేస్తుందని.. తెలంగాణలో ప్రశాంత్‌ కిషోర్‌ టీమ్‌ ఎంటర్‌ అయ్యిందని ప్రచారం జోరుగా సాగుతోంది.

Read More : Telangana : తెలంగాణలో ప్రశాంత్ కిశోర్.. పీకే టీం సర్వే

తెలంగాణ రాజకీయాల గురించి ఇప్పటికే అధ్యయనం చేసిన పీకే బృందం.. అసలు ప్రణాళికపై దృష్టిసారించినట్టు వార్తలొచ్చాయి. తెలంగాణ, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహం.. ఎన్నికలలో అనుసరించాల్సిన విధానంపై పీకే నేరుగా పర్యవేక్షించనున్నారని ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు ప్రశాంత్‌ కిశోర్‌ కామెంట్స్‌ వెనుక మతలబు ఏంటనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు.. 2022, మార్చి 19వ తేదీ శనివారం సీఎం కేసీఆర్ అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఈ భేటీ జరుగుతోంది. వివిధ అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. రాజకీయాలపై కూడా సీఎం కేసీఆర్ మంత్రులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.