Telangana CM : మంత్రులతో సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్.. ఎందుకు ?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సడెన్ గా అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ కావడం ఉత్కంఠను రేపుతోంది. ఫామ్ హౌస్ కు రావాలని పలువురు మంత్రులకు ఫోన్ కాల్ రావడంతో...

Telangana CM : మంత్రులతో సీఎం కేసీఆర్ ఎమర్జెన్సీ మీటింగ్.. ఎందుకు ?

Kcr Delhi

CM KCR Sudden Meeting With Ministers : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సడెన్ గా అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ కావడం ఉత్కంఠను రేపుతోంది. ఫామ్ హౌస్ కు రావాలని పలువురు మంత్రులకు ఫోన్ కాల్ రావడంతో.. వారు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఎమర్జెన్సీ మీటింగ్ లో ఏం చర్చించబోతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లతో పాటు సీఎస్ సోమేశ్ కుమార్ లు కూడా సమావేశంలో పాల్గొన్నారు. మంత్రులను ఎందుకు ఫామ్ హౌస్ కు పిలిచారనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఆయనతో  మొత్తం 9 మంది మంత్రులు భేటీ అయ్యారు.

Read More : Nalgonda : కాలువలో కారు కేసులో కొత్త ట్విస్ట్-కారు చోరీకి గురైందన్న యజమాని విఘ్నేశ్వరి

ఇటీవలే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. బడ్జెట్ లో ప్రధానమైన అంశాలు రెండున్నాయి. దళిత బంధుకు అధికంగా నిధులు కేటాయించిన తెలంగాణ సర్కార్.. దీనిని ఏ రకంగా అమలు చేయాలనే దానిపై ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ లో చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు…ఉద్యోగాల నోటిఫికేషన్ ఈ వారంలో వస్తుందని తెలుస్తోంది. నిరుద్యోగుల నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తోంది, ప్రభుత్వానికి పాజిటివ్ గా ఉన్నారా ? అన్న దానిపై మంత్రులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. ఇక మరో ప్రధానమైన అంశం..గత కొన్ని రోజులుగా రాజకీయాలు ఎలా కొనసాగుతున్నాయనే దానిపై సీఎం కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సిరిసిల్లలో జరిగిన వివాదంపై అడిగి తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు.

Read More : Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్ కారు ప్రమాద ఘటన.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే షకీల్ కజిన్ మీర్జా

సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ నియోజకవర్గం కావడంతో ఆయన కొంత సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ అమెరికా టూర్ లో ఉన్నారు. ఎమర్జెన్సీ మీటింగ్ కు హాజరైన వారిలో గంగుల కమలాకర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ లు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు కాగా.. మంత్రి హరీశ్ రావు గజ్వెల్ నియోజకవర్గానికి చెందిన వారు. వీరితో ఈ అంశంపై మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలు ఎందుకు దాడులు పాల్పడుతున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇక మరో కీలక అంశం…డిసెంబర్ నెలలో ముందస్తు ఎన్నికలకు వెళుతారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా ఎమర్జెన్సీ మీటింగ్ లో మంత్రులతో సీఎం కేసీఆర్ చర్చిస్తున్నట్లు సమాచారం. మీటింగ్ అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.