Telangana : తెలంగాణలో ప్రశాంత్ కిశోర్.. పీకే టీం సర్వే

గోవా ఎన్నికల అనంతరం తెలంగాణకు వచ్చారు. 2022, ఫిబ్రవరి 26వ తేదీ శనివారం సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తో ఆయన గజ్వేల్ పర్యటించారు.

Telangana : తెలంగాణలో ప్రశాంత్ కిశోర్.. పీకే టీం సర్వే

Prashanth Kishore

Prashant Kishor Survey Started In Telangana : తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టారు ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన ప్రశాంత్ కిశోర్. స్వయంగా ప్రశాంత్ కిశోర్ పర్యటిస్తుండడం గమనార్హం. గోవా ఎన్నికల అనంతరం తెలంగాణకు వచ్చారు. 2022, ఫిబ్రవరి 26వ తేదీ శనివారం సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తో ఆయన గజ్వేల్ పర్యటించారు. పీకే టీమ్ క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేసేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక సర్వేను పూర్తి చేసింది ఐప్యాక్. అభివృద్ధి ఏ మేరకు జరిగిందో ఈ టీమ్ పరిశీలిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇప్పటి నుంచి అడుగులు వేస్తోంది. గులాబీ బాస్ వ్యూహాత్మకంగా ముందుకొస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం వ్యూహాత్మకంగా ఎన్నికలకు అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై ఇప్పటికే కొంత సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి.. మరోసారి ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో సమగ్ర సర్వే చేయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Read More : Prashant Kishor: ప్రశాంత్‌ కిషోర్‌తో ముఖ్యమంత్రి రహస్య సమావేశం.. ఎందుకు?

ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో తెలుసుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఎంతవరకు సానుకూలత ఉందనే అంశంపై కూడా సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. నిఘా వర్గాల నివేదికలు, వివిధ సర్వేల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నారు. చాలాచోట్ల విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరి విపక్షాలకు అనుకూలంగా మారకూడదనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టారు. ఇప్పటికే జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించి… ఇతర పార్టీల నేతలతో ఆయన భేటీ అవుతున్నారు.

Read More : Prashant Kishore: మోడీ ఓడినా బీజేపీ పవర్ దశాబ్దాల పాటు తగ్గదంతే – ప్రశాంత్ కిశోర్

ఇక ప్రశాంత్ కిశోర్ విషయానికి వస్తే… 2014లో బీజేపీ ఎన్నికల వ్యూహకర్తగా చేసిన ప్రశాంత్ కిషోర్.. తర్వాత అనేక రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. తరువాత జేడీయూలో చేరారు. పార్టీ ఉపాధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి సహాయం చేశారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌కు సలహాదారుగా కూడా ఉన్నారు. ఇవే కాకుండా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్, ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేశారు. మరి తెలంగాణలో ఆయన అమలు చేసే వ్యూహాలు వర్కవుట్ అవుతాయా ? లేదా ? అనేది చూడాలి.