Prashant Kishore: మోడీ ఓడినా బీజేపీ పవర్ దశాబ్దాల పాటు తగ్గదంతే – ప్రశాంత్ కిశోర్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. గోవా పర్యటనలో భాగంగా మాట్లాడిన ప్రశాంత్.. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపీఏసీ) హెడ్ మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ అధికారంలో ఉంటుందని..

Prashant Kishore: మోడీ ఓడినా బీజేపీ పవర్ దశాబ్దాల పాటు తగ్గదంతే – ప్రశాంత్ కిశోర్

PRASHANT KISHORE

Prashant Kishore: ఇంకొన్ని దశాబ్దాల పాటు బీజేపీ పవర్ లోనే ఉంటుందంటున్నారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. గోవా పర్యటనలో భాగంగా మాట్లాడిన ప్రశాంత్.. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపీఏసీ) హెడ్ మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ అధికారంలో ఉంటుందని చెప్తున్నారు. మరోసారి బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే.. రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఫలితాలు అటుంచితే.. ఇంకొన్ని దశాబ్దాలు పవర్ లో ఉంటుందని అన్నారు.

దేశ రాజకీయాల్లో బీజేపీ కీలకంగా మారింది. వాళ్లు గెలిచినా.. కాంగ్రెస్ తొలి 40ఏళ్లులాగా బీజేపీ పాతుకుపోతుంది. బీజేపీ ఎక్కడికీ పోదు. జాతీయ స్థాయిలో 30శాతం ఓటింగ్ తెచ్చుకున్న పార్టీ ఇంత త్వరగా మనుగడలో నుంచి పోదు. ప్రజలు మోదీని పక్కకుపెట్టినా బీజేపీ సుస్థిరంగానే ఉంటుంది. కాంగ్రెస్ బలహీనపడటంతో ఇతర పార్టీలు ఓట్లను చీలుస్తున్నాయి.

మోడీ బలమేంటో తెలుసుకోవాలని అనుకోనంత వరకూ.. అతణ్ని ఓడించడం కష్టం. అసలు సమస్య ఎక్కడుందంటే అతని బలాలను అర్థం చేసుకోవడానికి సరిపడ సమయం కేటాయించడం లేదు. మోడీని అర్థం చేసుకోవడమే అసలు సమస్య. అది తెలిసినప్పుడే కౌంటర్ ఇవ్వగలం.

………………………………….: పిల్లల్ని ఎలా పెంచాలో పేరెంట్స్‌కి సలహాలిస్తున్న సామ్!

ఎలక్టోరేట్ లెవల్ లో చూస్తే.. 1/3వ మాత్రమే బీజేపీకి ఓటు వేస్తున్నారు. మిగిలిన అందరూ 10, 12 లేదా 15పొలిటికల్ పార్టీల వైపే అడుగులేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ క్షీణించిపోవడమే ఇందుకు కారణం. కాంగ్రెస్ కు ఆదరణ తగ్గిపోయింది. 65శాతం మంది చిన్న పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు.