దటీజ్ మోదీ.. ఈ సవాళ్లు అన్నింటినీ ఎదుర్కొని మరీ..

Narendra Modi: లక్ష్యాలను అర్థమయ్యేలా ప్రధాని వివరించిన తీరు ప్రజల్లోకి బాగా వెళ్లింది. బీజేపీ కేంద్రంలో..

Modi

Narendra Modi: ఎవరైనా బలంగా ఉన్నప్పుడు.. భవిష్యత్తులోనూ బలంగానే ఉంటామన్న నమ్మకం కలిగినప్పుడు… వెనకాముందూ ఆలోచించుకోరు. మరోలా జరిగితే అన్న ఊహను దరిచేరనీయరు. లక్ష్యాన్ని సాధించేసినట్టేనన్న అతివిశ్వాసం ప్రదర్శిస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు…అందరినీ దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు అస్సలు చేయరు. కానీ అందరికీ.. మోదీకి ఉన్న తేడా అదే.

303 సీట్లతో సొంతంగా మెజార్టీ ఉన్నప్పుడే..బీజేపీ సునాయాసంగా నిర్దేశిత లక్ష్యం 370 సీట్లు సాధించగలదన్న అంచనాలు వెలువడుతున్నప్పుడే….మోదీ మరో కోణాన్ని ఆలోచించారు. అన్నీ ఉన్నాయన్న, వస్తాయన్న అతిశయానికి పోకుండా ఆచితూచి అడుగులు వేశారు. రాజకీయాల్లో మనం బలంగా ఉండడం ఎంత ముఖ్యమో…ప్రత్యర్థి బలహీనంగా ఉండడమూ, ఉంచడమూ అంతే ప్రధానమన్న సూత్రాన్ని ఒంటబట్టించుకుని వ్యూహాలు ఫలితంగా మూడోసారి దేశప్రధాని అయ్యారు. రచించారు. మూడో విడత ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేక్రమంలో మోదీ ఒక్కో ఇటుకా పేర్చిన తీరు…..తలపండిన రాజకీయ విశ్లేషకుల అంచనాలను సైతం తలకిందులు చేసింది.

ఏకైక కారణం మోదీనే
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యదేశానికి మూడోసారి ప్రధాని అవ్వడానికి ఏకైక కారణం మోదీనే. దేశ ప్రధానిగా సాధించిన విజయాలే కాదు…అంచనాలకు అందని రీతిలో ఆయన వేసిన రాజకీయ అడుగులే…..ఆయన సరికొత్త చరిత్ర సృష్టించడానికి కారణమయ్యాయి. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టింది మోదీనే. కానీ నెహ్రూ కాలంతో పోలిస్తే..ఇప్పటికి రాజకీయ వాతావరణం పూర్తి భిన్నం. నెహ్రూ, మోదీ సామాజిక నేపథ్యాలు, రాజకీయ అడుగులు కూడా భిన్నమైనవే. నెహ్రూ సంపన్న కుటుంబానికి చెందిన వారు.

దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటం ఘనత మొత్తం గంపగుత్తగా కాంగ్రెస్‌ఖాతాలో పడింది. ప్రతిపక్షం బలహీనంగా ఉంది. గాంధీజీ మరణం తర్వాత నెహ్రూ భారత రాజకీయ ముఖచిత్రంగా మారారు. అప్పటికి దేశంలో పార్టీ అంటే కాంగ్రెస్సే…రాజకీయ నేత అంటే కాంగ్రెస్ నాయకుడే. అలా పరిస్థితులన్నీ పూర్తిసానుకూలంగా ఉన్నప్పుడు నెహ్రూ వరుసగా ప్రధానిగా ఉన్నారు.

కానీ మోదీ అలా కాదు. ఆయన ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. చాయ్‌వాలాగా గుర్తింపు పొందారు. కూటమిగా అయినా ప్రతిపక్షం బలంగానే ఉంది. సంకీర్ణ రాజకీయాల కాలం నడుస్తోంది. అనేక రాష్ట్రాల్లో జాతీయపార్టీలు నామమాత్రమై…ప్రాంతీయపార్టీల హవా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మోదీ దేశప్రధానిగా మూడోసారి ఎన్నికవ్వడం భారతదేశ చరిత్రలోనే కాదు..ఆధునిక ప్రపంచంలోనూ అతిపెద్ద విప్లవం.

బీజేపీ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందని హెచ్చరిస్తూ కాంగ్రెస్‌ సహా ఇతర పక్షాలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. రిజర్వేషన్ల అమలుపై ఎన్నడూ లేనిస్థాయిలో చర్చ జరిగింది. అసలు మోదీ మరోసారి ప్రధాని అయితే..దేశంలో జరిగే చివరి ఎన్నికలు ఇవేననీ ప్రతిపక్షాలు జోస్యం చెప్పాయి.

మరి ఇలాంటి విపరీత ప్రచారాన్ని సైతం దాటుకుని కొన్ని రాష్ట్రాలను బీజేపీ క్లీన్‌స్వీప్ ఎలా చేయగలిగింది..? జాతీయ స్థాయిలో వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండి కూడా..కరోనా కల్లోలాన్ని తట్టుకుని కూడా బీజేపీ 240 సీట్లు ఎలా సాధించగలిగింది..? మోదీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకం కలగడానికి కారణమేంటి..? మోదీని ఇండియా ముఖచిత్రంగా ప్రపంచదేశాలు ఎందుకు చూస్తున్నాయి..?

పదేళ్లు (2004-2014 మధ్య) అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ కూటమిపై అవినీతి, శాంతిభద్రతల నిర్వీర్యం వంటి ఆరోపణలతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ భారీ వ్యతిరేకత తర్వాత అధికారంలోకి రావడం, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ ఉండడంతో 2014-2019 మధ్య మోదీ ప్రభుత్వ పాలన నల్లేరు మీద నడకలా సాగిపోయింది. 2019-2024 మధ్య మాత్రం భారీ మెజార్టీ ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి.

ఆర్టికల్ 370 ఎత్తివేత, ట్రిబుల్ తలాక్ రద్దు వంటివి సాఫీగానే సాగినా…వ్యవసాయ చట్టాల అమలు, CAA, కామన్ సివిల్ కోడ్ వంటి అమలు అనుకున్నంత తేలిగ్గా సాధ్యం కాలేదు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. CAA అమలును వాయిదా వేయాల్సివచ్చింది. కామన్ సివిల్ కోడ్ ఎన్నికలముందు మాత్రమే తెరపైకి వచ్చింది. వీటన్నింటికి తోడు కరోనా రూపంలో అసలైన సవాల్ ఎదురయింది. సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాల్సివచ్చింది.

ధరలు అదుపుతప్పినా…
కరోనాతో ఆర్థికాభివృద్ధిపై పెను ప్రభావం పడింది. ధరలు అదుపుతప్పాయి. రష్యా, యుక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపాయి. అయితే ఈ సవాళ్లన్నింటినీ ప్రధాని మోదీ చాకచక్యంగా అధిగమించారు. సమయానుకూల నిర్ణయాలతో దేశం సంక్షోభం బారినపడకుండా నివారించారు. పొరుగుదేశాలు శ్రీలంక, పాకిస్థాన్‌కు ఎదురయిన దుస్థితి భారత్‌కు రాకుండా అడ్డుకున్నారు. మొదటిదఫాలో చేపట్టిన మేకిన్ ఇండియా వంటి ఫలితాలు ప్రభావం చూపాయి.

మరోపక్క విదేశాంగవిధానంతో అంతర్జాతీయంగా భారత్‌ను బలీయంగా మార్చారు. పాకిస్థాన్ సైతం భారత్‌ను ప్రశంసించేస్థితిలోకి తీసుకెళ్లారు. సంస్కరణలున వేగవంతం చేసి సంపద సృష్టించారు. విశాలమైన రహదారుల నిర్మాణం, వందేభారత్ రైళ్లు, డిజిటల్ లావాదేవీలు, పారిశ్రామకరంగాలకు ప్రోత్సాహం వంటివాటితో ప్రజల జీవనవిధానంపై ప్రభావం చూపారు. ఫలితంగా కొత్త ఇండియా ఆవిర్భావానికి బాటలు వేశారు.

అయితే పదేళ్లు వరుసగా అధికారంలో ఉండడంతో పాటు మతానికి ప్రాధాన్యత పెరిగిందన్న ఆరోపణలు, సంపద అందరికీ సమానంగా పంపిణీ కావడం లేదన్న విమర్శలు, ధరల పెరుగుదల, ప్రభుత్వరంగంలో ఉద్యోగాల కొరత, రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడ్డ ప్రభుత్వాల్లో జోక్యం చేసుకోవడం, అదేపనిగా జరిగిన సీబీఐ, ఐటీ దాడులు వంటివి ..బీజేపీపై ఊహించిన దానికన్నా వ్యతిరేకతను పెంచాయి.

అవినీతి ఆరోపణలు ఉన్నవారిని పార్టీలో చేర్చుకోవడం, పాలన ఒకే చోట కేంద్రీకృతమయిందన్న భావన వంటివి విమర్శకులకు పని కల్పించాయి. సొంతంగా 370 సీట్లు సాధించడమే లక్ష్యమని ఎన్నికల కురుక్షేత్రంలో దిగినప్పటికీ.. ఈ పరిస్థితులన్నింటినీ గమనించిన ప్రధాని మోదీ పొత్తుల విషయంలో ఎవరికీ అందని ఎత్తులు వేశారు. ఆయన వ్యూహాలతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా ఎన్డీఏ కూటమిని బలపడడంతో పాటు ఇండియా కూటమి బలహీనపడి…మూడోసారి మోదీ దేశప్రధాని అయ్యేందుకు మార్గాన్ని సుగమం చేసింది.

యూపీఏ కూటమి ఇండియాగా..
యూపీఏ కూటమి ఇండియాగా పేరు మార్చుకుని… అనేక పార్టీలను కలుపుకుపోయింది. ఆ కూటమి ఏర్పాటయినప్పుడు..బలంగానే కనిపించింది. అయితే ఇండియా కూటమికి, ఎన్డీయే కూటమికి ఒకే ఒక తేడా ప్రధానిమోదీ. ఆ ఒక్క తేడానే బీజేపీని మరోసారి ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టింది. ఇండియా కూటమి గెలిస్తే..దేశ ప్రధాని ఎవరో ఎవరికీ తెలియదు. చెప్పే ధైర్యం కూడా కూటమిలోని పార్టీలకు లేదు. ఇంకా చెప్పాలంటే..ఇండియా కూటమిలో ఉన్న ప్రతి పార్టీ అధినేతా ప్రధాని అభ్యర్థి రేసులో ఉన్నవారే. అలాగే ఇండియా కూటమిలో ఎందరున్నా ఆ కూటమి ముఖచిత్రంగా కనిపించేది కాంగ్రెస్సే.

Also Read: సరికొత్త ప్రధానిని మోదీలో చూడబోతున్నామా? ఎందుకంటే?

కానీ కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషిస్తే..ఒప్పుకోవడానికి కూటమిలోని ఏ పార్టీ సిద్ధంగా లేని విచిత్ర పరిస్థితి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నప్పటికీ..ఆయనను ప్రధాని అభ్యర్థిగా హస్తం పార్టీ బయటకు చెప్పలేకపోయింది. ఇక మిగిలిన పక్షాల నోటివెంట రాహుల్ మాటే రాలేదు. అదే సమయంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోదీనే అని అందరికీ తెలుసు. మోదీ అభ్యర్థిత్వంపై ఎన్డీఏలోని పక్షాలన్నింటికీ ఏకాభిప్రాయం ఉంది. అసలు తనను తాను గ్యారెంటీగా చూపి..మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ తేడా ఎన్నికల ఫలితాలపై సుస్పష్ట ప్రభావం చూపింది. అనేక రాష్ట్రాల్లో బీజేపీకి భారీగా సీట్లు కట్టబెట్టింది.

బీజేపీలో, ఎన్డీఏలో ఎంతమంది నేతలున్నా…ప్రధాని మోదీనే ఆ పార్టీకి, కూటమికి స్టార్‌క్యాంపెయినర్..వికసిత భారత్ తన లక్ష్యమని, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దుతానని ప్రధాని ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రకటించారు. పదేళ్లలో భారత్ సాధించినవాటన్నింటిపైనా ప్రచారం జరిపారు. ఇండియా..న్యూ ఇండియాగా ఎలా రూపాంతరం చెందిందో పూసగుచ్చినట్టు వివరించారు. మళ్లీ అధికారంలోకి వస్తే… ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం, సోలార్ వ్యవస్థ, AI వంటివాటిలో భారత్ ముద్ర ఎలా ఉండబోతోందో చెప్పారు.

Also Read: మోదీ 3.0 క్యాబినెట్‌లో వింతలు, విశేషాలు.. ఓడిన నాయకులకు మంత్రి పదవులు!

భారత్‌ను పదేళ్లకాలంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా మార్చామో..ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రానున్న రోజుల్లో ఎలా మారుస్తామో వెల్లడించారు. 2014కు ముందు-తర్వాత కాలాన్ని పోలుస్తూ ప్రసంగాల జరిపారు. విదేశాంగవిధానం గురించీ, భారత్ వ్యతిరేక శక్తులను మట్టుబెట్టడం గురించీ మాట్లాడారు. విమర్శలు వచ్చినప్పటికీ హిందూముస్లిం రాజకీయాల గురించీ మాట్లాడారు. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకమని తేల్చిచెప్పారు.

ఉన్నది ఉన్నట్టుగా.. చేసింది చేసినట్టుగా.. లక్ష్యాలను అర్ధమయ్యేలా ప్రధాని వివరించిన తీరు ప్రజల్లోకి బాగా వెళ్లింది. బీజేపీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే..రాజ్యాంగాన్ని మారుస్తారని..ఇవే చివరి ఎన్నికలవుతాయని, రిజర్వేషన్లు ఉండబోవని కాంగ్రెస్ చేసిన వ్యతిరేక ప్రచారం కన్నా….ప్రధాని మోదీ తన పాలన గురించి తాను చెప్పుకున్న సానుకూల ప్రచారం ఓటర్లపై ప్రభావం చూపింది. భవిష్యత్తుకు మోదీ గ్యారెంటీ అన్న నినాదం ఎక్కవమందికి నమ్మకం కలిగించింది. ఫలితంగా నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టి.. సరికొత్త సృష్టించారు మోదీ.

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ వచ్చిన వార్తలపై కేరళ ఎంపీ సురేశ్ గోపీ క్లారిటీ

ట్రెండింగ్ వార్తలు