కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ వచ్చిన వార్తలపై కేరళ ఎంపీ సురేశ్ గోపీ క్లారిటీ

ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీగా నిలిచారు. సురేశ్ గోపీ తాజాగా చేసిన వ్యాఖ్యల గురించి

కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ వచ్చిన వార్తలపై కేరళ ఎంపీ సురేశ్ గోపీ క్లారిటీ

Suressh Gopi

కేంద్ర మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ, మలయాళ నటుడు సురేశ్ గోపీ తనను పదవి నుంచి తప్పించాలని హైకమాండ్‌ను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వార్తలను ఆయన ఖండించారు.

‘‘మోదీ క్యాబినెట్ మంత్రి పదవికి నేను రాజీనామా చేస్తానంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మేము కేరళ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పనిచేయడానికి కట్టుబడి ఉన్నాం’’ అని సురేశ్ గోపి ట్వీట్ చేశారు.

అలాగే, సురేశ్ గోపీ తన పదవి నుంచి వైదొలగలాని భావిస్తున్నట్లు వస్తున్న కథనాలను ఆయన కార్యాలయం కూడా కొట్టేసింది. సురేశ్ గోపీ ఎప్పుడూ అలాంటి ప్రకటన చేయలేదని చెబుతోంది. కాగా, లోక్ సభ ఎన్నికల్లో త్రిస్సూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన సురేశ్ గోపీ సీపీఐ నేత వీఎస్‌ సునీల్‌ కుమార్‌పై గెలిచారు.

ఆ రాష్ట్రం నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీగా నిలిచారు. సురేశ్ గోపీ తాజాగా చేసిన వ్యాఖ్యల గురించి అనేక రకాల కథనాలు వచ్చాయి. కేంద్ర పదవిని ఆయన వదులుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఇప్పుడు అవన్నీ ఊహాగానాలేనని తేలిపోయింది.

Also Read: మీ రుణం తీర్చుకుంటాం.. ఇక నా లక్ష్యం అదే: బాలకృష్ణ